YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ ఈసీ వర్సెస్... ఏపీ

మళ్లీ ఈసీ వర్సెస్... ఏపీ

మళ్లీ ఈసీ వర్సెస్... ఏపీ
విజయవాడ, 
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.కోవిడ్‌ 19 పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని జగన్ సర్కార్‌ తేల్చి చెప్పింది. తాడేపల్లిలో స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సీఎం వైఎస్‌ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందని తెలిపారు. నవంబర్‌ నెలలో కోవిడ్‌ కేసులు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.దీంతో ఎన్నికలు నిర్వహించాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. కాగా, గతంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండగా, సీఎం జగన్ మాత్రం స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పడం గమనార్హం

Related Posts