గుంటూరు, అక్టోబరు 24,
ఆయన యువ నాయకుడు. వివాద రహితుడు. ఫ్యూచర్‌పై పట్టున్న నేత. రాష్ట్ర సమస్యలపై సమగ్రంగా ఆలోచన చేయగల సత్తా ఉన్న నేత. మంచి మాటకారి.రెండు భాషల్లో అనర్గళంగా మాట్లాడి.. పార్టీ వాయిస్‌ను వినిపించే నేత. నియోజకవర్గంలో తనతోపాటు.. తనపార్టీ కూడా అభివృద్ధి చెందాలనే దృక్ఫథంతో ఉన్న నాయకుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేనే లేదు. కానీ, ఆయనకు పార్టీలో ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. అధిష్టానం ఏకంగా ఆయనకే చెక్ పెట్టేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఏంజరుగుతోంది ? విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్య టీడీపీకి సానుకూలమైన నాయకుడు. సోషలిస్టు భావాలు ఉన్న పెద్దాయన. అదే సమయంలో చంద్రబాబు అంటే.. ఆయనకు మహా ఇష్టం. బాబు హయంలో ఆయన విద్యాసంస్థలను విస్తరించుకున్నారు. అయితే, పార్టీ పరంగా చూస్తే.. తన కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయులు.. వైసీపీలో ఉన్నారు. గత ఏడాది.. ఎన్నికల్లో నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం అందుకున్నారు పార్టీకి కూడా చాలా నమ్మకస్తుడు.. ఏ పనిచెప్పినా.. సాధించుకుని వచ్చే నేతగా పేరు తెచ్చుకున్నారు. పైగా నియోజకవర్గంలో అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తున్నారు.ఎంపీగా ఆయన శైలి బాగున్నా.. ఇటీవల కాలంలో మాత్రం లావు వివాదస్పదమవుతున్నారు. పార్టీలోని కొందరు ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీకి, లావుకు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా.. పార్టీ అధిష్టానం.. లావును పట్టించుకోవడం మానేసి. రజనీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఎంపీ అనుచరులు చెబుతున్నారు. మరి దీని వెనుక ఏంజరిగిందని ఆరా తీస్తే.. ఎంపీ తండ్రి రత్తయ్యే కారణమని తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆయన తన కుమారుడు వైసీపీలో ఉన్నప్పటికీ.. టీడీపీకి అనుకూలంగా ఉండడం, చంద్రబాబుతో స్నేహం కొనసాగిస్తుండడమే అట.తరలింపుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. ఇటీవల ఓ పత్రికలో వ్యాసం రాయడం వంటివి వైసీపీలో చర్చకు వచ్చాయని. దీంతో పైకి ఏమీ అనే ఉద్దేశం లేక.. లావును పట్టించుకోవడం మానేశారని ప్రచారం జరుగుతోంది. అంటే.. రేపు లావు.. టీడీపీలోకి జంప్ చేసినా. చేసే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతోనే లావును టార్గెట్ చేస్తున్న వారికే పార్టీ మద్దతు ఇస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక లావు సైతం వివాదాలకు రజనీ, బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్లతో విబేధాలు ఉన్నా సొంత ఇమేజ్ కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తూ తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. అదే సమయంలో జిల్లాకే చెందిన మరో ఎంపీ ద్వారా కూడా లావుపై కొందరు పార్టీ పెద్దలు నిఘా పెట్టించారని అంటున్నారు. ఓ ఎంపీగా కేంద్రం ద్వారా కొన్ని అభివృద్ధి పనులకు నిధులు రాబడుతున్నారు. స్థానికంగా పార్టీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కొందరు నేతల నుంచి సపోర్ట్ లేకపోయినా ఆయన మాత్రం తనదైన శైలీలో ముందుకు వెళుతున్నారు.