YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు జిల్లాలే వైసీపీకి కీలకం

మూడు జిల్లాలే వైసీపీకి కీలకం

ఒంగోలు, అక్టోబ‌రు 24, 
రాజధాని ప్రాంతంలో వైసీపీకి ఆశలు లేనట్లేనా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేదా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేత. అయితే సంక్షేమ పథకాలను అమలు తమ ప్రభుత్వం అమలు చేస్తుండటంతో కొంత అనుకూలత కూడా ఉంటుందని వారు నమ్ముతున్నారు.రాజధాని అమరావతి అంశం పదమూడు జిల్లాల్లో పాక లేదు. టీడీపీ కానీ, రాజధాని అమరావతి జేఏసీ కానీ ఇచ్చిన పిలుపులకు ఈ మూడు జిల్లాల్లో తప్ప ఎక్కడా స్పందన కన్పించడం లేదు. అందుకే రాబోయే ఏ ఎన్నికలయినా ఈ మూడు జిల్లాలే వైసీపీకి కీలకంగా మారనున్నాయి. అందుకే ఈ మూడు జల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ మూడు జిల్లాల్లో కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమే కాకుండా సత్వరం పూర్తి చేయాలన్నది వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా కన్పిస్తుంది.గత ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో వైసీపీ మెరుగైన ఫలితాలను సాధించింది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 శాసనసభ నియోజకవర్గాలుంటే అందులో రెండింటిని మినహా పథ్నాలుగు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. గన్నవరం, విజయవాడ తూర్పు నియోజవర్గం మినహా అన్ని నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక గన్నవరం ఎమ్మెల్యే వైసీపీకి మద్దతు పలికారు. గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల్లోనూ రెండింటిలో మినహా పదిహేను స్థానాల్లో విజయం సాధించింది. గుంటూరు వెస్ట్, రేపల్లెలో మాత్రమే టీడీపీ గెలిచింది. ఇందులో గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి మద్దతు ప్రకటించారు.ప్రకాశం జిల్లాలో మాత్రం గత ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలను సాధించింది. మొత్తం పదమూడు నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో తొమ్మిందిటిలో వైసీపీ గెలిచింది. నాలుగు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. కొండపి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు టీడీపీ సొంతమయ్యాయి. అయితే కరణం బలరాం వైసీపీ వైపు వెళ్లారు. అయితే వైసీపీ ప్రభుత్వం తాజాగా జరిపించిన సర్వేలో అమరావతికి వ్యతిరేకంగా ఈ మూడు జిల్లాల ప్రజలు ఉన్నట్లు గుర్తించారు. అందుకోసమే ఈ మూడు జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. భవిష్యత్ లో జగన్ ప్రారంభించే ఏ కార్యక్రమమైనా ఈ జిల్లాల నుంచే ప్రారంభించాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.

Related Posts