ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకర్షించేందుకు జియో బాటలోనే నడుస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఇస్తున్న టారిఫ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. రూ.399తో రీఛార్జ్ చేయడం ద్వారా 28 రోజుల పాటు, రోజుకు 1జీబీ డేటా, అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. జనవరి మొదటి వారంలో ఈ ప్యాక్‌ను 70 రోజులకు అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. అంటే రూ.399 పెట్టి ఒకసారి రీఛార్జ్ చేస్తే 70 రోజుల పాటు పై సదుపాయాలన్నింటినీ కల్పిస్తోంది. తాజాగా ఈ ప్యాక్‌ను 84 రోజులకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. జియో రూ.398 ప్యాక్‌నకు పోటీగా దీనిని తీసుకొచ్చింది. అయితే జియో ఈ టారిఫ్ కింద 70 రోజుల కాలపరిమితిని విధించగా, రోజుకు 1.5జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఇస్తుండటం గమనార్హం.
అదే విధంగా రూ.149 ప్యాక్ కింద ఇస్తున్న ఆఫర్లను ఎయిర్‌టెల్ సవరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వినియోగదారులు రూ.149తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.