YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీ మహా లక్ష్మీదేవి చెల్లెల్లు, సోదరుడు ఎవరు..??

శ్రీ మహా లక్ష్మీదేవి చెల్లెల్లు, సోదరుడు ఎవరు..??

శ్రీ మహా లక్ష్మీదేవి చెల్లెల్లు, సోదరుడు ఎవరు..??  లక్ష్మీదేవి మాత ఎక్కడ వుండదు..? ఎక్కడ ఎక్కడ వుంటుంది..!!
ప్రతి ఇంట్లోనూ సిరిసంపదలు లక్ష్మీకటాక్షంతోనే పొందగలుగుతాం. ఆ తల్లి అనుగ్రహం ఉన్నంతవరకు ఇంట్లో లేమి అన్న సమస్య ఉండదు. కొంతమంది ఇబ్బందులు, సమస్యలు, డబ్బులు నిలబడకపోవడం, ఖర్చులు, అప్పుల బాధలు, రకరకాల సంపద సమస్యలు ఎదుర్కొటు ఉంటారు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉండాలి.
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం. గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిదమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం..
గవ్వలు  వల్ల కలిగే ఉపయోగాలు :...
1)    పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.
2)    కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
3)    గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం  వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.
4)    గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
5)    గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
6)    వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.
7)    వివాహ సమయములలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది కాబట్టి గవ్వలు కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.
8)    వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
9)    గవ్వల గల గలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే..
భగవద్భక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండడు.
శంఖద్వని వినిపించని చోటా.
తులసిని పూజించని చోట.
శంఖరుని అర్చించని చోట.
బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.
ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.
ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
విష్ణువును ఆరాధించకుండ.
ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
చెట్లను కూలగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
నిరాశావాదులను, సూర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
పసుపక్షులను హింసించే చోట వుండనే వుండదు.
సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు.
మరి లక్ష్మీ దేవి ఎక్కడ  వుంటుంది అంటే :..
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.  ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలా కలగదో చెప్పారు. అన్నిటి కంటే సంతృప్తి కి మించిన ధనం ఎక్కువలేదు. దానితోనే సంతోషము కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళ శ్రీ మహా లక్ష్మి కరుణ మనతోనే వుంటుంది.  సంపద మన ఆధీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆధీనం లో ఉండకూడదు . ఏ కాస్త గర్వించిన, అహంకారము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం..

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts