YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సంపత్కరీదేవి

సంపత్కరీదేవి

శ్రీ లలితాదేవి యొక్క గజ దళానికి సంపత్కరీ  దేవి  అధికారిణి.  ఈ దేవి అనుగ్రహం లభించినవారికి నవ నిధులు సంప్రాప్తిస్తాయి. కోట్లాది గజ , తురగ ,  రధములు  కలిగిన సంపత్కరీ దేవి తనను నమ్మి వచ్చిన భక్తులందరికి సకల సంపదలను  అనుగ్రహిస్తుంది. లలితా సహస్రనామములలో "సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితా " అనే నామము ఈ దేవిని కీర్తిస్తున్నది. ఒక కోటి ఏనుగులు వెంటరాగా, సకలాస్త్రశస్త్రములు దేవికి రక్షణ కాగా ,  రణకోలాహలమనే ఏనుగు మీద  అధిరోహించి  దర్శనమిస్తుంది. ఎంత పేదరికం లో వున్నవారికైనా ఈ దేవి అనుగ్రహం తో సకలసౌఖ్యాలు లభిస్తాయి. దేవి అధిరోహించిన ఏనుగు యొక్క ఒక్కొక్క అడుగు లోను తామరపద్మాలు దర్శనమిస్తాయి. ఒక్క ఏనుగుని పోషించడానికే  పెద్ద నిధి అవసరమౌతుంది. కోటానుకోట్ల ఏనుగులను పోషిస్తున్న సంపన్నురాలు. ఆ పెన్నిధులనన్నిటిని తనను భక్తితో ఉపాసించేవారికి అడగకనే  కటాక్షించే కరుణామయి సంపత్కరీదేవి. లలితాంబికను కీర్తించే స్తోత్రాలలో ముఖ్యమైన, అతి శక్తివంతమైన  అంకుశమును, ఎవరైతే భక్తి శ్రధ్ధలతో ధ్యానిస్తారో వారు  సకలదేవతలను, భూపాలకులను, శతృవులను సహితం తమ వశం చేసుకొనే శక్తిని పొందగలరని చెప్తారు. అంతటి మహిమ కలిగిన అంకుశ అంశయే ఈ సంపత్కరీ దేవి. ఏనుగుని మదమణిచేందుకు అంకుశం ఉపయోగ పడినట్లు, మానవులలోని  అహంకారాన్ని సంపత్కరీ దేవి అణిచి వేస్తుంది. అణిగి పోయిన ఏనుగు ఎన్నో ఉపయోగకరమైన పనులకు సహాయపడినట్లు,  అహంకారం , మోహం అణగారి తనను శరణాగతితో పూజించే భక్తుల జీవితాలలో శుభములను కలిగించి సకలసౌభాగ్యములను కటాక్షిస్తుంది ఏనుగులు, గుఱ్ఱములు వేరే ఎక్కడో లేవు. మనలోనే, చపలత్వం ,  అహంకార రూపాలలో వున్నాయి. మొండిదైన అశ్వమును అధిరోహించడానికి ముందు దానిని మచ్చిక చేసుకొని లొంగదీసుకోవాలి. అలాగే  దేవి అనుగ్రహం పొందడానికి మనలో వుండే అహంకారాన్ని ,మదాన్ని సంపూర్ణంగా అణచివేసుకొని భగవంతుని పాదాలనాశ్రయించాలని  దేవీ తత్వం బోధిస్తుంది. సంపత్కరీ దేవి నమ్మినవారిని రక్షింపక వదలదు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts