(1) త్రాణము అంటే కాపాడుట. అర్త అంటే వేడుకోలు. కష్టాలను బాపుమని ప్రార్థిస్తే ఆర్తత్రాయపరాయణుడైన నారాయణుడు కావగలడు.
(2) త్రిదండి శ్రీమన్నారాయణుడంటే మనోదండం, వాగ్దండం, కర్మదండం అనే మూడుదండాలుగల సన్యాసి. మనసులో, మాటలో, పనిలో శుద్ధికలవాడని అర్థం.అందుకు గుర్తుగా మూడు కర్రలను వారు చేతిలో ధరిస్తారు.
(3) ద్రావణం అంటే, అందులో పడిన వస్తువులను ద్రవీకరింపచేసుకొంటుంది.అందుకే ద్రావణమైంది.
(4) ఛాందసుడంటే వేదాలను సమగ్రంగా తెలుసుకొన్నవాడు, ఒౌపోసన పట్టినవాడని అర్థం. చేసిన, చేసే కర్మలు వేదహితంగాంనే ఉండాలని వాదించువాడు. అలా లేకపోతే అంగీకరించనివాడు విమర్శించగలవాడు.
(5) ఆ ఉరవడిలోనే పనిపూర్తి చేయాలి. ఉరవడంటే వేగం, పరాక్రమం.
(6) అగోచరమంటే పంచేద్రియాలకు మనోబుద్ధికి కనబడనది.కనపడదు. పంచేద్రియాలంటే కండ్లు, ముక్కు, నోరు, చెవులు, చర్మం.
(7) అలిపిరి అనగా దుర్భలం, మెల్లనిది అనే అర్థాలు కూడావున్నాయి. అలిపిరి దగ్గరనుండి శ్రీవారికొండ ఎక్కడం దుర్భలం (కష్టం), మెల్లగా నడవటం వలననేమో ఈ స్థలానికి అలిపిరనే పేరువచ్చి వుండవచ్చును.
(8) సభారంభం సంభ్రమముగా జరిగింది. ఇక్కడ సంభ్రమంటే వేగంగా, ఆర్భాటంగా అనే అర్థాలు కూడా వున్నాయి.
(9) సింహద్వారం అంటే తలవాకిలి.తలవాకిట దగ్గరుండు వస్తాను. ఇది ఇంటికో భవనానికో ప్రధానద్వారం.
(10) హైందవధర్మమంటే వేద, ఆర్య, అనార్య ధర్మాల కలయిక వలన ఏర్పడిన జీవనవిధానం.