YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దేశానికి దిక్చూచి ఉపాధ్యాయుడే

దేశానికి దిక్చూచి ఉపాధ్యాయుడే

కరీంనగర్ అక్టోబర్ 25,

దేశానికి దిక్చూచి ఉపాధ్యాయుడే జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్ ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేట్ ఉపాధ్యాయులకు సన్మానం దేశ భవిష్యత్తులో ఉపాద్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోవిడ్ నిబంధనలు అనుసరించి ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సమక్షంలో జిల్లాలోని 15 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను జాయింట్ కలెక్టర్ చే సన్మానించారు. ఈ  సందర్భంగా జేసీ మాట్లాడుతూ, స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ అపార మేధావి అని, ఆయన ఉపాద్యాయుని నుండి రాష్టప్రతి స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయుడని, వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ట్రస్మా ఎన్నో రకాలుగా ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ప్రయివేటు రంగం లేకుండా ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా ఆత్మవిశ్వాసం కల్పించిన విధంగా, విద్యాశ్రీ ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను ఆదుకుంటుందనే  ఆశాభావం వ్యక్తం చేశారు. ఏందుకంటే మధ్యతరగతి ప్రజల పిల్లలు 60 శాతం బడ్జెట్ పాఠశాలల్లో చదువుతున్నారని ట్రస్మా  రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోరేం సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి, శ్రీనివాస రావు ఉత్తమ ఉపాధ్యాయులు జమ్మికుంట నుండి డా.పుల్లూరు సంపత్ రావు, సుంకేశుల సంతోష్  రావు, బద్ధుల రాజ్ కుమార్, చొప్పదండి నుండి కటారి రవికుమార్, హుజురాబాద్ నుండి కోరేం సంజీవరెడ్డి, గీతాషాజు, గుర్శకుర్తి నుండి  గుజ్జుల మాధవి, కరీంనగర్ నుండి డా.శ్రీపాల్ రెడ్డి,  సందబోయిన ముత్తయ్య, విజయలక్ష్మి, నగేష్ రెడ్డి, బండ శ్రీకాంత్, అనురాధ, గన్నేరువరం నుండి బూట్ల శ్రీనివాస్ రామ్మడుగు నుండి జగన్ మోహన్ గౌడ్ లు పాల్గొన్నారు.
 

Related Posts