విజయవాడ అక్టోబరు 25,
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి దర్శించుకున్నారు. విజయకీలాద్రి దివ్యక్షెత్రం తరుపున దుర్గమ్మకు పట్టువస్ర్తాలు జీయర్ స్వామి సమర్పించారు. త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి మాట్లాడుతూ కరోనా నుంచి భక్తులకు భయం లేకుండా అమ్మవారు చేయాలి. భారతదేశంలోనే కరోనా వ్యాక్సిన్ తయారు కావాలి. అమ్మ అనుగ్రహంతో నే కొండచరియలు దొర్లినా ప్రమాదం సంభవించలేదు . కరోనా వ్యాక్సిన్..రోగనిరోదక శక్తిని పెంచుకొనే శక్తి అమ్మవారు ఇవ్వాలని కోరుకున్నానని అన్నారు. అమ్మ అనుగ్రహం ప్రతిఒక్కరిపై ఉండాలని ప్రజలందరి కోసం ప్రార్ధన చేస్తున్నా. అమ్మవారు అనుగ్రహం క్రుష్ణానది పై ఉండి ఇలానె ఎల్లఫ్పుడూ నదీ ప్రవాహంతో ఉండి పాడి పంటలు సంమ్రుద్ధిగా పండాలని కోరుకుంటున్నా. ప్రతి చిన్న వస్తువు కి చైనా పై ఆధారపడుతున్నాం...మన దేశంలో 60 శాతం యువత ఉంది...వారిని మరింత ప్రోత్సహిస్తే మనమే ప్రతి వస్తువు తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది యువతను ప్రోత్సహిస్తున్నాం . కోవిడ్ ద్రుష్ట్యా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి...మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావాలని అమ్మవారిని ప్రార్థించా. వ్యాక్సిన్ వస్తే ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి పెరిగి తిరిగి శక్తిమంతులవుతారు. భారత్ తిరిగి శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని కోరుకున్నా. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైంది . ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అన్నారు.