YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీలో ప్రతి ఐదుగురిలో ఒకరికి వాహనం

సిటీలో ప్రతి ఐదుగురిలో ఒకరికి వాహనం

హైద్రాబాద్ లో వాహానాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  దాదాపు టూ వీలర్స్ , ఫోర్ వీలర్స్...అన్ని లెక్క పెట్టుకుంటే... ప్రతి ఐదుగురిలో ఒకరికి వాహానం ఉంది. అయితే  అధికారులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని చెబుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే ఆదేశించింది. నగరంలో ప్రజారవాణా కోసం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఎంఎంటిఎస్ సబర్బన్ రైళ్లతోపాటు అద్దె కార్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ప్రజా రవాణా కోసం ఆర్టీసీ 3850 బస్సులను నడుపుతుండగా ఆ టోలు లక్ష 25 వేలు, క్యాబ్స్ 25వేలకు పైగా ఉన్నాయి. ఐటీ కంపెనీల్లో పని చేసివారికి పగలు, రాత్రి లేకుండా కార్లు అం దుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నియంత్రణలోకి తీసుకు రావాలని సూచించింది. రవాణాశాఖ, ఆర్టీసీ, జిహెచ్‌ఎంసి, పోలీసులు శాఖ లు సమన్వయంతో మెరుగైన రవాణా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించింది. దానికి అనగుణంగానే అప్పట్లోనే ఆర్టీసీకి సంబంధించి రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డితో పాటు ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులు మంబా యి వెళ్లి అధ్యయనం చేశారు. ముంబయ్‌లో ‘క్యూ’ సిస్టమ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. భద్రతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఆదేశించినా ఆయా శాఖల అధికారులు మెక్కుబడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రజారవాణా లో కీలకమైన ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు వం టి వాటిలో జిపిఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక నియంత్రణ వ్య వస్థను రూపొందించాలని ఆదేశించారు. ఇవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందంగా తయారైంది. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఆర్టీసీలో పలు ఏర్పా ట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో జిపిఎస్ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే జిపిఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలిసే వివరాలను ఏర్పాటు చేయాలి. కాని అ ధికారులు చేసిన అరకొర ఏర్పాట్లు చేసిన కారణంగా అది మంచి ఫలితాలను ఇవ్వలేక పోయింది. ఇక పోతే మహిళ భ్రదతకు సంబంధించి సుమారు వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సు లో పార్టీషన్స్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రవాణా వాహనాల తో ఆర్టీసీకి నష్టం వస్తున్నా రవాణా శాఖ అధికారులు చూసీచూడనుట్ల వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల దోపిడే పరమావధిగా ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.

Related Posts