YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

24 గంటల కరెంట్ తో అడుగంటిన గ్రౌండ్ వాటర్

24 గంటల కరెంట్ తో అడుగంటిన గ్రౌండ్ వాటర్

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకు అడుగుంటున్న  గ్రౌండ్ వాటర్ ఆందోళన కలిగిస్తున్నాయి. భూగర్భలోతు మట్టం నెలానెలా పడిపోతోంది.  ప్రస్తుతం 24 గంటల కరెంట్ సరఫరా అవుతుండటంతో నిరంతరంగా బోరు బావుల నుంచి నీటిని తోడేస్తున్నారు. ఆటో స్టార్టర్లు తొలగించని కారణంగా నీరంతా వృధా అవుతోందని, ఫలితంగా భూగర్బ జలాలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతులంతా దాదాపు బోరుబావులపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 84,927 బోరుబావులు వుండగా, 67,941 బో రు బావులకు ఆటో స్టార్టర్లు ఉన్నట్టు అధికారిక లెక్కల ద్వా రా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ సరఫరా అవుతున్నప్పటికీ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గత జులై నెల నుంచే ప్రభుత్వం ప్రయోగాత్మకంగా వ్యవసా య రంగానికి 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తోం ది. రైతులు వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న ఆటో స్టార్టర్ల వల్ల 24 గంటల పాటు అవసరం వున్నా, లేకపోయినా మోటారు నడుస్తూ నీరు వృధాగా పోతున్నది. ఈ కారణంగా దాదాపు 9నెలల్లో నీటి వినియోగం తీ వ్రంగా పెరిగిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, నాగల్‌గిద్ద, కల్హేర్ తదితర మండలా ల్లో భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గుతున్నాయి.ఫలితంగా భవిష్యత్‌లో జిల్లా ప్రజలకు తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా బోర్ల తవ్వకాలతో పాటు వ్యవసాయ రంగానికి 24గంటల కరెంట్ సరఫరాతో నిరంతరంగా బోర్లు పనిచేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలల్లో ఒకటి నుంచి మూడు మీటర్ల వరకు భూగర్భజల మట్టం పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన నారాయణఖే డ్, మనూరు, కంగ్టి, కల్హేర్ తదితర మండలాల్లో ఇప్పటి నుంచే నీటి కష్టాలు మొదలయ్యాయి. బోరుబావుల్లో నీటి మట్టం పాతాళానికి పడిపోవడంతో ప్రజలు నీటి కోసం కోసుల దూరం నడవాల్సివస్తోంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రజలకు సాగునీటికి, తాగు నీటికి కష్ట కాలం తప్పదని అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే ఏకైక తాగు, సాగునీటి ప్రాజెక్టు అయిన సింగూరు నుంచి గత కొన్ని నెలల కింద నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 15 టిఎంసిల నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేసిన విషయం తెలిసిందే.పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీటితో సింగూరు ప్రాజెక్టులో నీటి సామర్థం పూర్తి స్థాయికి చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో మంజీరా నది పరీవాహక ప్రాంతంతో పాటు సిం గూరు బ్యాక్ వాటర్‌ను వినియోగించుకొనే ప్రజలు కూడా ఎంతో సంతోషించారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం వుంటే బ్యాక్ వాటర్ ద్వారా మనూరు మండలం తో పాటు నది పొడువునా ఉన్న గ్రామాల రైతులు కూడా నీటిని వినియోగించుకొని పంటలు పండించుకోవడంతో పాటు భూగర్భ జలాలు కూడా బాగా వృద్ధిలోకి వస్తాయని ఆశించారు. కానీ వీరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్చింది. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు లోతుకు పడిపోయాయి. ప్రాజెక్టు నీటి మట్టం తగ్గిపోవడంతో పాటు వ్యవసాయ బోర్ల వద్ద ఆటో స్టార్టర్ల ద్వారా రైతులు భూగర్బ జలాలను తోడేస్తుండటంతో భూగర్భ జలాలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి

Related Posts