హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
విద్యా ప్రాప్తికి:
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
ఉద్యోగ ప్రాప్తికి:
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
కార్య సాధనకు:
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
గ్రహదోష నివారణకు:
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ! శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
ఆరోగ్యమునకు:
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
సంతాన ప్రాప్తికి:
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్! సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
వ్యాపారాభివృద్ధికి:
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
వివాహ ప్రాప్తికి:
యోగి ధ్యేయాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.