కర్నూలు అక్టోబరు 27,
అధికారులు ఎంత కట్టడి చేసినా దేవరగట్టు బన్నీ ఉత్సవం మాత్రం ఆగలేదు. సోమవారం రాత్రి దేవరగట్టుకు భక్త జనంభారీగా తరలివచ్చారు. కరోన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్రల సమరాన్ని జిల్లా అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినా కరోన ను కూడా లెక్క చేయని భక్తులు, కర్రలతో గట్టుకు చేరుకున్నారు. పదిహేను రోజులుగా ఏడు గ్రామాల ప్రజలను అవగాహన కలిగించిన లాభం లేకుండా పోయింది. అర్థ రాత్రి కాగడల దివిటీలతో కర్రలతో స్వామి వారి ఊరేగింపు జరిగింది. ఊరేగింపు నేపధ్యంలో కర్రలతో ఒకరికొకరు తోపులాడుకున్నారు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించు కునేందుకు రెండు వర్గాలుగా విడిపోయిన భక్తులు రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్ఆరు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు చేతులెత్తేసారు. మొత్తానికి జైత్రయాత్రలో దేవరగట్టులో యుద్ద వాతావరణం కనిపించింది. దేవరగట్టులో వైద్య సిబ్బందిని, తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చెయ్యలేదు. దీంతో క్షత గాత్రులను ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. దేవరగట్టుకు దాదాపు లక్ష మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు