YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగ కల్పనే లక్ష్యం కడప స్టీల్ ప్లాంట్, కొప్పర్తి క్లస్టర్ పై సీఎం సమీక్ష

ఉద్యోగ కల్పనే లక్ష్యం కడప స్టీల్ ప్లాంట్, కొప్పర్తి క్లస్టర్ పై సీఎం సమీక్ష

అమరావతి అక్టోబ‌రు 27, 
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్పై అధికారులతో సీఎం వైయస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు.   క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ  సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. సీఎం మాట్లాడుతూ కడప స్టీల్ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలి. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని అన్నారు.  కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏడు ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని,  వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని అధికారులు  సీఎంకు వివరించారు. స్టీల్ప్లాంట్ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని అధికారులు వివరించారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి మూడు,  నాలుగు వారాల్లో పనులు ప్రారంభిస్తామని అన్నారు.  ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలన్న సీఎం, పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలని అన్నారు.  కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ప్లాంట్ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఆ తర్వాత కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న  ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్పై సమీక్ష చేసారు. క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను  అధికారులు వివరించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్న అధికారులు.ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉంది. డిక్సన్తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలి. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలని సీఎం అన్నారు. 

Related Posts