YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గగుడికి రూ 4.36 కోట్ల ఆదాయం

దుర్గగుడికి రూ 4.36 కోట్ల ఆదాయం

విజయవాడ అక్టోబ‌రు 27, 
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించాం. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారని దుర్గగుడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను చక్కగా నిర్వహించగలిగాం. కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేవాలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు కేటాయించడం చారిత్రాత్మకం. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుర్గమ్మ దేవస్థానానికి  85 వేల మంది ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, వారిలో దాదాపు 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారు. నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ ఏర్పాటుచేసాం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2 లక్షల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో దేవస్థానానికి రూ.4.36 కోట్ల ఆదాయం వచ్చిందని అయన వెల్లడించారు. అభివృద్ధి పనులకు త్వరితగతిన అంచనాలను రూపొందించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారని అయన అన్నారు.  ఆలయ ఈవో ఎం.వి.సురేష్ బాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యాలు, రక్షణ చర్యలకు ఏవిధమైన లోటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆన్లైన్ విధానంలోనే దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులు విధిగా ఆన్లైన్ టిక్కెట్లు తీసుకోవాలని అన్నారు.

Related Posts