YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మో...అమ్మోనియం

అమ్మో...అమ్మోనియం

విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌రు 28, 
అమ్మోనియం చుట్టూ అలాంటి వాతావరణమే అలముకోవడం విశాఖ వాసుల్లోనే కాదు, యావత్‌ ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారింది. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు విశాఖ పోర్టుకు గడచిన 20ఏళ్లకు పైగానే రవాణా అవుతున్న సంగతి జగమెరిగిన సత్యం. అంతర్జాతీయంగా బీరుట్‌ నగరంలో జరిగిన అవాంఛనీయ ఘటనతో వైజాగ్‌ పోర్టు, అమ్మోనియం దిగుమతులకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. కాలుష్య నిబంధనలన్నీ పాటిస్తూనే వైజాగ్‌ పోర్టుకొచ్చిన అమ్మోనియం ఉత్పత్తులను ఆయా డిస్ట్రిబ్యూటర్‌లకు పంపించే పనిని షిప్‌లోంచి దించీ దించగానే పోర్టు చర్యలు చేపడుతుంది. దీంతో అమ్మోనియం స్టాక్‌ అనే ప్రశ్న గానీ, ప్రమాదం అన్న భయాందోళన గానీ ఇంతవరకూ లేదు. అయితే బీరుట్‌లో ఘటన అందరినీ ఆందోళనలోకి నెట్టేయడంతో వైజాగ్‌ పోర్టుకొచ్చిన అమ్మోనియం ఉత్పత్తుల ఓడలు సముద్రంలోనే నాలుగు వరకూ ఉండిపోయాయి. దీంట్లో 60వేల టన్నుల అమ్మోనియం నిల్వలు ఉండిపోయాయి. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా ఈ వ్యవహారంలో మీడియా చూపిస్తున్న ఆసక్తిపైనా చర్చ జరుగుతోంది. అమ్మోనియంతో కేవలం ప్రమాదం మాత్రమే ఉందని చూసే దృష్టికోణంతోనే అసలు సమస్యగా ఉంది.విశాఖ నగరానికి ప్రమాదం పొంచి వుందన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. ప్రమాదం జరిగితే ఎక్కడైనా ఎప్పుడైనా నష్టం జరగడం అనేది అందరికీ తెలిసిందే. కానీ వాస్తవాలతో నిమిత్తం లేని సంచలనాలు, భయానికి గురిచేసే విషయ ప్రచారంతో అత్యంత ప్రమాదం పొంచి ఉంటుందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మోనియం ఉత్పత్తుల దిగుమతులు, లైసెన్సులలో అనేక సమస్యలు ఉంటాయన్నది కాదనలేనిది. గడచిన కొన్నాళ్లుగా శ్రావన్‌ షిప్పింగ్‌ సంస్థ ఈ అమ్మోనియం లైసెన్సు దారుగా ఉంది. బీరుట్‌ ఘటనల నేపథ్యంలో ఈ సంస్థ లైసెన్సు కూడా రద్దయింది. ఈ కంపెనీ లైసెన్స్‌ రద్దుకు అధికార పార్టీ ఎంపీ శతవిధాలు ప్రయత్నం చేసినట్లు విమర్శలున్నాయి. అయితే లైసెన్స్‌ను సదరు కంపెనీ పునరుద్ధరించుకోవడంలో సఫలీకృతమైంది. ఈ తతంగం పెద్ద ఎత్తున సాగడంపై విశాఖ యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. ఈ సంస్థ సేఫ్టీ చర్యలు పాటించకపోతే ప్రభుత్వ పరంగా ఎటూ చర్యలు ఉంటాయన్నది కాదనలేనిది. ఏ సంస్థకైనా ఇది తప్పదు. అయితే అమ్మోనియం లైసెన్సులు ఎవరికి లభించినా, లభించకపోయినా విశాఖలో సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. దీని చట్టూ తాజాగా అలముకుంటున్న 'రాజకీయాల'పై మాత్రం సర్వత్రా చర్చ నెలకొనడం విశేషం. జరుగబోయే ఒక ప్రమాదాన్ని నిలువరించే సత్తా మీడియా సంస్థలకు ఎప్పుడూ ఉంటుంది. అది అవాంఛనీయ ఘటనలకు దారి తీయకుండా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రసార సాధనాలకు పదును పెట్టకపోతే నిజంగా ప్రమాదం కొనితెచ్చుకునే అవకాశం పొంచే ఉంటుందన్నది మరువకూడదు. ప్రమాదమంటూ... ప్రచారం కంటే ఆ ప్రమాదాన్ని తప్పించే ఉపాయాలే అత్యంత ముఖ్యమైనవి. విశాఖ ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కేంద్రంగా భాసిల్లుతోంది. ఎల్‌జి పాలిమర్స్‌ ఘటన యావత్‌ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఏదైనా ఘటన జరిగితేగానీ ఇతర అంశాలు అటు ప్రభుత్వానికి ఇటు సామాజిక మాద్యమాలకు పట్టకపోవడం ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఇదే కొనసాగితే అమ్మోనియం నిల్వలే కాదు... అప్పడాల కంపెనీలతో కూడా ప్రమాదమే.

Related Posts