తండాలో జిల్లా కలెక్టర్ రాత్రి బస
అనంతపురం
అనంతపురం జిల్లా కదిరి మండలంలోని రామదాస్ నాయక్ తండాలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రడు రాత్రి బస చేసారు. బుధవారం ఉదయం తండాలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత అయన మీటే నాయక్ తండాలో పర్యటించారు. గ్రామస్తులతో కలసి టీ తాగిన కలెక్టర్ వారితో ముచ్చటించారు. మీటే నాయక్ తండాలో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అయన ప్రజలకు హామీ ఇచ్చారు.
కదిరి మండలం బోడె నాయక్ తండాలో దరఖాస్తు చేసుకుని మూడు నెలలైనా బియ్యం కార్డులో మా కుమారుడు కార్తీక్ నాయక్ పేరును ఎక్కించలేదని గంగాధర్ నాయక్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసాడు. వెంటనే 10 నిమిషాల్లో కుమారుడి పేరు ఎక్కించి వివరాలతో ఉన్న బియ్యం కార్డును కలెక్టర్ వారికి అందజేసారు. తరువాత అయన మండలంలోని ఎర్ర దొడ్డి, కాళసముద్రం గ్రామ సచివాలయాలను పరిశీలించారు.