హైలెవెల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన మంత్రి వేముల
హుజూర్ నగర్
తెలుగు రాష్ట్రాలను కలుపుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జ్ ను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు హజరయ్యారు.
ఈ వంతెన నిర్మాణం ద్వారా కోదాడ,హుజూర్ నగర్ ప్రజలకు 30 కి.మీ దూరం తగ్గుతుంది. కోదాడ-హుజూర్ నగర్-మట్టపల్లి-దాచన్ పల్లి మీదుగా గుంటూరు రోడ్డు ను ఈ మట్టపల్లి బ్రిడ్జ్ కలుపుతుంది.
ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావాలనేది ఈ రెండు నియోజకవర్గాల ప్రజల చిరకాల కోరిక. హుజూర్ నగర్, మట్టపల్లి, మేల్లచెరువు,చింతలపాలెం, నేరడిచెర్ల, కోదాడ, చిలుకూరు, అనంతగిరి, నడిగుడం, మునగాల,మోతె మండలాల రైతులకు రవాణా సౌలభ్యం కలగనుంది.