YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

7 కోట్ల మంది ఓటింగ్...

7 కోట్ల మంది ఓటింగ్...

వాషింగ్టన్,అక్టోబరు 28  
ముంద‌స్తు ఓటింగ్‌లో అమెరికా కొత్త చ‌రిత్ర సృష్టించింది. 2016 దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌లో.. స‌గం క‌న్నా  ఎక్కువ సంఖ్య‌లో ఓట్లు ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్‌లో పోలైన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  ఎన్నిక‌ల తేదీకి ఇంకా వారం రోజుల స‌మ‌యం ఉన్నా.. ఇప్ప‌టికే 7 కోట్ల మంది అమెరిక‌న్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో ముంద‌స్తు ఓటింగ్ జ‌రుగుతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.  గ‌త శ‌తాబ్ధంలోనే ఇది అత్య‌ధిక స్థాయి ఓటింగ్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరుకు ఈ ఓటింగ్ నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు. అంతేకాదు, కోవిడ్ నేప‌థ్యంలో ఆ వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి దూరంగా ఉండేందుకు కూడా ఓట‌ర్లు ముంద‌స్తు ఓటింగ్‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.  మెయిల్ బ్యాలెట్‌లో డెమోక్రాట్లు ముందు ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస‌త్ఉన్నారు. మెయిల్ బ్యాలెట్ ద్వారా రిగ్గింగ్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ట్రంప్ ఆరోపించినా.. రిప‌బ్లిక‌న్లు భారీ సంఖ్య‌లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్లు తెలుస్తోంది. ముంద‌స్తు ఓటింగ్‌ను విశ్లేషిస్తున్న నిపుణులు.. 1908 త‌ర్వాత భారీ స్థాయిలో ఓటింగ్ జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Related Posts