మళ్లీ మొదటికి జలవివాదం
హైదరాబాద్,
జలవివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్‌లో ఆంధ్ర, తెలంగాణ వాదనలు వినిపించినప్పటికీ కేంద్ర జల శక్తి శాఖ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో రెండు రాష్ట్రాల మధ్యనెల కొన్న జలవివాదాలు సమసి పోలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరీ సమార్ధ్యం పెంపును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అపెక్స్ కమిటీ విధానపరమైన నిర్ణయం ప్రకటించలేదు. పైగా ఈ ప్రాజెక్టు కొత్తది కాదని పాతప్రాజెక్టును డిజెన్ మార్చి నిర్మించుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ వినిపించిన వాదనలపై కేంద్ర జల శక్తి శాఖ ఆధీనంలోని అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల జరిగిన అపెక్స్ కమిటీలో తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు వినిపించిన వాదనల మినిట్స్‌పై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసిన అనంతరమే నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో సిఎం కెసిఆర్ ప్రతిపాదించినప్పటికీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేయకుండానే మినిట్స్‌ను కేంద్ర జల శక్తి శాఖ ఇరు రాష్ట్రాలకు పంపించిందిఅపెక్స్‌కౌన్సిల్ మీటింగ్ మినిట్స్‌ను రెండు రాష్ట్రాలతో పాటుగా కృష్ణానదీ యాజమాన్యబోర్డు, గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్‌ను పంపించింది. అయితే ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు మినిట్స్‌పై సంతకాలు చేసిన అనంతరమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రతిపాదనలను అపెక్స్ కౌన్సిల్ పరిశీలించకుండానే మినిట్స్‌ను రూపొందించి రెండు రాష్ట్రాలకు పంపించారు. ఈ నేపథ్యంలో అపెక్స్‌కౌన్సిల్‌లో జరిగిన చర్చలు, కేంద్రం రూపొందించిన సమావేశం మినిట్స్‌పై తెలంగాణ రాష్ట్రనీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంపును శాశ్వతంగా నిలిపి వేయాలని ప్రతిపాదనలు రూపొందించే అవకాశాలున్నాయని తెలిసింది. అలాగే అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలపై 1956 యాక్ట్‌లోని సెక్షన్3 మేరకరు కృష్ణానదీ జలాలపంపిణీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు.అయితే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పడగానే సిఎం కెసిఆర్ ప్రధానికి లేఖరాసినా స్పందన రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టులో కేసును వాపసు తీసుకుంటే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ హామీ ఇచ్చారు. అయితే కేసును వాపసు తీసుకోవడానికి సిఎం కెసిఆర్ ముందుకు వచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో కేంద్రం ఇప్పటికీ నిర్ణయం ప్రకటించలేదు. ప్రధానంగా ఈ అంశాలన్నిటికీ మినిట్స్‌లో చేర్చి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు అపెక్స్ కౌన్సిల్ పంపించింది. అయితే మినిట్స్ మీద ముఖ్యమంత్రుల సంతకాలు లేవు ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించిన అంశాలు, మినిట్స్‌లో పొందు పర్చిన అంశాలపై తెలంగాణ సాగునీటి శాఖ సుధీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అంతరాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బోర్టు ఏర్పాటుచేస్తే ఆంధ్ర అక్రమంగా తరలిస్తున్న నీరుకూడా లెక్కకు వస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ అభిప్రాయపడుతుంది.