YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

 ఫ్యాన్స్ కు త‌లైవా బ్యాడ్ న్యూస్ చెన్నై, 

 ఫ్యాన్స్ కు త‌లైవా బ్యాడ్ న్యూస్ చెన్నై, 

 ఫ్యాన్స్ కు త‌లైవా బ్యాడ్ న్యూస్
చెన్నై, 
త‌లైవా అంటే ఆ లెక్క వేరే. ఎంతో ఆశ‌గా చూస్తున్నారు. అంద‌రూ సినిమాల‌కి పోతుంటే.. మేక‌ప్ వేసుకుంటుంటే.. మా సారేంటి.. ఎప్పుడూ కాన‌రావ‌ట్లేదు అని చూస్తున్నారు. నిజమే సినిమా అప్డేట్స్ లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఒక్క సినిమా కూడా స్టార్ట్ కావ‌డం లేదు. య‌ట్ లీస్ట్ పొలిటిక‌ల్ అప్డేట్స్ లో కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే బాగా డిస‌ప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఆయ‌న‌ని గుర్తులేకుండా వేరే ప‌నిలో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. నిజ‌మే క‌దా.. ఏదో ఒక అప్డేట్ ఉంటే ఎప్పుడెప్పుడా అని చూస్తుంటారు. లేదంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. కానీ.. గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా.. ఫీల్ అవుతూనే ఉంటారు. అదే క‌దా అభిమానం.అలాంటి అభిమ‌నుల్ని ఇంకా డిస‌ప్పాయింట్ చేస్తున్నాడు త‌లైవా. ఇప్పుడ‌ప్పుడే షూటింగ్ ల‌కు వెళ్ల‌డ‌ట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఈ దిక్కుమాలిన క‌రోనా వ‌చ్చింది క‌దా. అది పూర్తిగా పోయే దాకా రార‌ట‌. నిజ‌మే క‌దా. ర‌జ‌నీకాంత్ పెద్ద వ‌య‌సాయ‌న‌. వ‌స్తే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. అలాంటి టైమ్ లో ఈ కోవిడ్ గురించి క‌చ్చితంగా ఆలోచించాల్సిందే. అందుకే.. షూటింగులు కూడా పోస్ట్ ఫోన్ చేశార‌ట‌. నిర్మాత‌లు, డైరెక్ట‌ర్లు కూడా మీ ఇష్టం సార్.. ఎప్పుడొస్తే అప్పుడే మొద‌లెడ‌దాం.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జ‌స్ట్ చేసుకుంటాం అన్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై కూడా క్లారిటీ ఇస్తార‌ట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.ఇక పార్టీ విష‌యానికొస్తే కూడా ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీస్ లేవు. అప్పుడెప్పుడో పార్టీ అన్నారు. వ‌దిలేశారు. మ‌ధ్య‌లో తుర్రున దూరింది ఈ క‌రోనా. ఇక ఆ పార్టీ ఎవ్వారం అంతే పోయింది. పెట్టార‌ని కొంద‌రు.. పెడ‌తార‌ని కొంద‌రు.. బ‌య‌టి నుంచి స‌పోర్ట్ చేస్తార‌ని కొంద‌రు.. లేదు పోటీ చేస్తార‌ని ఇంకొంద‌రు.. రాజ‌కీయాల్ని స‌మూలంగా కూక‌టి వేళ్ల‌తో పీకి ప‌డేస్తార‌ని మ‌రికొంద‌రు.. ఎన్ని మాట‌లో. అయితే.. ఈ విష‌యంలో కూడా త‌లైవా క్లారిటీగానే ఉన్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ట ర‌జ‌నీకాంత్. ర్యాలీలు, మీటింగ్ లు లేకుండా పార్టీని న‌డ‌ప‌డం అంత ఈజీ కాదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగే సిచ్చువేష‌న్ లేదు. అందుకని ఈ ఒక్క‌సారికీ ఆగుదాం అనుకుంటున్నార‌ట‌. దీనిపై కూడా త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇస్తార‌ట..సూప‌ర్ స్టార్.

Related Posts