తిరుమలలో విప్ ప్రభాకర్ రెడ్డి
తిరుమల
తిరుమల శ్రీవారిని ప్రభుత్వ విప్ ప్రభాకర్ రెడ్డి కుటుంబసమేతంగా ఇవాళ ఉదయం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఎంపీ గల్లా జయదేవ్, చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే నాని, టిటిడి మాజీ జేఈవో శ్రీనివాసరాజు వేర్వేరుగా, శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు
చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు .పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆలయం వెలుపల ప్రభుత్వ విప్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కక్ష సాధింపుతో బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.నవరత్నాల
పథకంలో భాగంగా, రైతు భరోసా కార్యక్రమం కింద ఈ నెల 27వ తేదీ, రైతులకు వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందన్నారు. వచ్చే మార్చి నాటికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 13500 నగదు జమ చేస్తామన్నారు. తమ ప్రభుత్వం,మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందన్నారు. ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. ఆయనకు ఎల్లవేళలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.