ఉల్లి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గూడూరు
బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయ ధరలు అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరకు ఉల్లిపాయలను అందిస్తుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రైతుబజార్లో సబ్సిడీపై ఉల్లిపాయల పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉల్లిపాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ తో తక్కువ ధరకు అందించిందని ఇప్పుడు మళ్లీ ఉల్లిపాయల ధరలు 110 రూపాయలు ఉండడంతో సబ్సిడీతో కేజీ 40 రూపాయలు వంతున తెల్ల రేషన్ కార్డు కలిగిన వ్యక్తికి రెండు కేజీల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని పేద మధ్యతరగతి ప్రజలపై భారం
పడకుండా రాష్ట్ర ప్రభుత్వం 70 రూపాయలు సబ్సిడీని భరించి ఉల్లిపాయల పంపిణీ చేస్తుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మణికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఎస్ఐ సైదులు, తదితరులు పాల్గొన్నారు ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు