ఐఎస్బీ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గౌతం రెడ్డి
అమరావతి అక్టోబరు 29
'ఐఎస్ బీ' సంస్థ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గోన్నారు.
నెల్లూరు జిల్లా క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా అయన హాజరైయ్యారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులు హజరయ్యారు.