తాడిపత్రి పాత ఈద్గాలో ఉన్న జొహరా కుట్టుశిక్షణా కేంద్రంలో ప్రారంభమైన ఈ ఉచిత కుట్టుశిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. వక్ఫ్ బోర్డ్ ఆధ్యర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి హజరై ప్రారంభించారు. తాడిపత్రిలో ముస్లిం మహిళలకోసం ఈ కార్యక్రమం రూపోందించారు. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని తాడిపత్రి, పెద్దపప్పూర్,యాడికి, పెద్దవడుగూరు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 250మంది ముస్లిం మహిళలను ఈ ఉచిత శిక్షణ కోసం ఎంపిక చేశారు.ఈశిక్షణ 90రోజుల పాటు కొనసాగుతుంది.శిక్షణ పూర్తిచేసుకున్న ముస్లిం మహిళలకు వృత్తి నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేయడం జరుగుతుంది.ఈ సందర్భంగా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రానికి ఎంపికైన మహిళలకు జె.సి.నాగిరెడ్డి షాదీఖానాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ముస్లిం కుటుంబాల జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన ఈ కుట్టుశిక్షణా తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కుట్టుశిక్షణ .ఈకార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వీ.రవీంద్రారెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ బి.ఎండి.జిలాన్,టౌన్ బ్యాంక్ అధ్యక్షులు దద్దo సుబ్బరాయుడు,జిల్లా మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఈడీ తాజుద్దీన్,యాడికిఎంపీపీ రంగయ్య,తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి అయూబ్ బాష,వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు జాకీర్,ఉపాధ్యక్షుడు ముస్తాక్, కార్యదర్శి షె క్షవాలి,కోశాధికారి సయ్యద్ సందాని సాబ్, ఉపకార్యదర్శి మహమ్మద్ రఫీ,పట్టణ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు రషీద్, హాజిబాష,వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లు హుసేన్ పీరా,అమీర్, నాసిర్,నాజుబాష,నబిరసూల్,గౌస్ మోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.