బంగారం డౌన్.... వెండి లాస్
ముంబై, అక్టోబరు 30,
బంగారం సంబంధించిన ఏ వార్త అయినా.. బంగారం లాంటి వార్తే మనోళ్లకి. కాకపోతే.. పెరిగిందంటే కాస్త ఫీల్ అవుతారు. కానీ.. తగ్గిందంటే మాత్రం పండగే. ఇప్పుడు కూడా బంగారం ధర తగ్గిందనేదే ఇంట్రస్టింగ్ టాపిక్. అవును.. 24 క్యారెట్ల బంగారం ధర.. 340 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల బంగారం 51 వేల 720 కి చేరింది. ఇక 22 క్యారెట్ల ధర కూడా 320 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 47 వేల 410 ఉంది. మామూలుగా అయితే.. బంగారంతో పాటు.. నేనూ బంగారాన్నే అంటూ పరుగులు పెడుతుంది వెండి ధర. అది పది రూపాయలు పెరిగితే.. ఇది రెండు రూపాయలు అయినా పెరుగుతుంది. ఈసారి మాత్రం డిఫరెంట్ బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర పెరుగుతుంది. కేజీ వెండి ధర ఏకంగా 2 వేల 3 వందలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 64 వేల 700 కు చేరింది. ఇక్కడ వెండి ధర పెరిగింది కానీ.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం బంగారం ధర బానే ఉంది. కాస్త పెరిగింది కూడా.అయితే.. బంగారం ధర ఇక్కడ తగ్గడం మాత్రం మనోళ్లకి గుడ్ న్యూసే. కానీ.. బంగారం ధర తగ్గినప్పుడల్లా కొంతమంది మాత్రం బాధ పడడం. పెరిగితే ఆనందం పడడం జరుగుతుంది. వాళ్లే గోల్డ్ స్కీమ్ కస్టమర్లు. సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ బాండ్ల స్కీమ్ లో ఎంతో మంది కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టారు. అప్పట్లోనే కొన్న వాళ్లు.. డబుల్ రేట్ వస్తుంది అని ఆశగా ఉన్నారు. కొంతమంది మాత్రం ఇదే పీక్స్ రేటు.. ఇంతకంటే పెరగదు అని అమ్మడానికి రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లూ పెరుగుతూ వచ్చిన గోల్డ్ బాండ్ల రేటు.. ఇప్పుడు తగ్గే ఛాన్స్ ఉంది. ఇలాగే తగ్గితే ఎలారా బాబూ అని తల పట్టుకుంటున్నారు