YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తలకోన అడవుల్లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

తలకోన అడవుల్లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

తలకోన అడవుల్లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
అక్రమ రవాణా చేస్తున్న 46 ఎర్రచందనం దుంగలు లభ్యం
నలుగురు స్మగ్లర్లు అరెస్టు
చిత్తూరు అక్టోబ‌రు 30, 
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ గురువారం  ఆర్ధరాత్రి చేసిన మెరుపు దాడుల్లో 46 ఎర్రచందనం దుంగ లు లభ్యమయ్యాయి. వాటిని మూసుకుని వస్తున్న స్మగ్లర్లు లో నలుగురు పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు కు అందిన సమాచారంతో ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, వాసు ల టీమ్ లు గురువారం రాత్రి తలకోన పరిసరాల్లో కూంబింగ్ చేపట్టింది. నెరబైలు నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటుకనుమ ప్రాంతంలో దాదాపు 50 మందికి పైగా ఎర్ర స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వీరు దుంగలను విసిరేసి పారిపోయారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించగా అర్థ రాత్రి నలుగురు స్మగ్లర్లు ను అదుపులోకి తీసుకున్నారు. వీరు తమిళనాడు లోని తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా కు చెందిన జవ్వాదు మలై వాసులుగా గుర్తించారు. వీరిని పలనివేల్ వెంకట రామన్ (32), కుమారన్ సెట్టు (20), బాబు కలై అరసన్ (26), రామసామి అన్నా మలై (33)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే డిఎస్పీ వెంకటయ్య, ఆర్ ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐ రామమూర్తి, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. 50 మంది స్మగ్లర్లు ను ఎదుర్కోవడంలో సాహసోపేతంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఎస్పీ ఆంజనేయులు అభినందించారు. సి ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts