YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఫార్మా కంపెనీల వ్యర్ధ రసాయనాలతో పెద్ద సంఖ్యలో చేపల మృతి

ఫార్మా కంపెనీల వ్యర్ధ రసాయనాలతో పెద్ద సంఖ్యలో చేపల మృతి

ఫార్మా కంపెనీల వ్యర్ధ రసాయనాలతో పెద్ద సంఖ్యలో చేపల మృతి
విశాఖపట్నం అక్టోబ‌రు 30
విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరిశ్రమల నిర్లక్ష్య వైఖరి పరవాడ రైతుల పాలిట శాపంగా మారింది. శుక్రవారం ఉదయం పెద్ద చెరువు లోని చేపలు పెద్ద సంఖ్యలో మృతి చెందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా వ్యర్థ  రసాయనాలు చెరువులో కి ప్రవేశిస్తూ ఉండటంతో చేపలకి ఊపిరి అందక మృత్యువాత చెందుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు .  వర్షాల సమయంలో తరచూ వ్యర్థ రసాయనాలను బయటకు విడుదల చేస్తుండడంతో అవి కాస్త ఊర చెరువు, పెద్ద చెరువుల్లోకి ప్రవేశించి  పండించే పంటల పైన, మత్స్య సంపద పైన స్థానిక గ్రామస్తులు పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పంటలు పండక పోవడం, చెరువులను మత్స్య సంపద మృత్యువాత పడటం స్థానిక గ్రామస్తులు  అనారోగ్యం బారిన పడడం పరిపాటిగా మారిందని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాంకీ ఫార్మా సిటీ కి చెందిన పంపు హౌస్ వద్ద ఉన్న ఫార్మా వ్యర్ధ జలాల మ్యాన్ హోల్ లీకై  పెద్ద సంఖ్యలో వ్యర్థ జలాలు రోడ్ల పైకి కాలువలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా మరికొన్ని పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా వర్షాలు పడుతున్నప్పుడు వ్యర్థ జలాలను బయటకు వదిలి పెడుతున్నాయని అన్నారు: పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts