YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెరిగిన వేతనం..చేతినిండా పని..

పెరిగిన వేతనం..చేతినిండా పని..

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కార్మికులకు పనులు కల్పిస్తూ వారు ఆర్ధికంగా నిలదొక్కుకునే చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పథకంతో కోట్ల మంది కూలీలు లబ్ధిపొందుతున్నారు. అయితే ఇటీవలిగా కొన్ని ప్రాంతాల్లో ఉపాధి పనులపై పలువురు అనాసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం కంటే అధికంగా బయటి పనుల ద్వారా వస్తుండడంతో వాటిపైనే మొగ్గుచూపుతున్నారు. విషయం గుర్తించిన కేంద్రప్రభుత్వం వేతనాన్ని రూ.197 నుంచి రూ.205కు పెంచింది. దీంతో పథకం నీరుగారదని కూలీలు ఉపాధి హామీ పథకాన్ని సమర్ధవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావించింది. ప్రభుత్వం కూలీల వేతనం పెంచడంతో సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. ఇదిలాఉంటే ప్రస్తుతం వేసవి కావడంతో ఈ పథకం పరిధిలో నిర్వహించే పనులు జోరందుకోనున్నాయి. ఎందుకంటే పొలాల్లో కుంటల తవ్వకాలు, చెరువుల్లో పూడికతీతలు లాంటి పనులు విస్తృతంగా నిర్వహించనున్నారు. ఫలితంగా కూలీలకు చేతినిండా పని ఉంటుంది. దీంతో కూలీలు పనులపై ఆసక్తి చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

 

పెరిగిన వేతనం వల్ల మెదక్ జిల్లాలోని 4లక్షల మందికిపైగా ఉన్న ఉపాధి కూలీలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.30 లక్షల విలువైన పనులు కల్పించాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వేసవిలో ఉపాధి హామీ పనులు ఎక్కువగా జరగనున్నాయి. ఈ ఏడాదిలో వందరోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలకు సైతం మళ్లీ పనులు కల్పించాలని నిర్ణయించారు. పండ్లతోటల పెంపకం, ఇంకుడుగుంతలు, వ్యవసాయ కుంటల, చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. దీంతో ఈ సీజన్ లో ఉపాధి కల్పన ఆశాజనంగానే ఉండనుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రతిరోజు 57,344 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి రోజుకు కూలి రూ.205 చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన వేతనంతో కూలీలు  మరింత ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి పనులు పెంచి.. లబ్ధిదారులందరికీ అధికారులు అవకాశం కల్పిస్తుండడంతో సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. వేసవి కావడంతో కూలీల ఆరోగ్య పరిరక్షణకూ ప్రాధాన్యతనివ్వాలని, పనులు జరిగే ప్రాంతాల్లో టెంట్లు వేయడంతో పాటూ, సత్వరమే ప్రాథమిక చికిత్స లభించే ఏర్పాట్లు కూడా చేయాలని అంతా సూచిస్తున్నారు. కూలీలకు మంచినీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts