YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇసుక..మోయలేని భారం 

ఇసుక..మోయలేని భారం 

ఇసుక..మోయలేని భారం 
కర్నూలు, అక్టోబర్ 31, 
ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఇసుక విధానం నిర్మాణదారులకు తలకు మించిన భారమవుతోంది. మెట్రిక్‌ టన్ను రూ.375 నిర్ణయించి రవాణా ఛార్జీల పేరుతో ఇష్టానుసారంగా ప్రజలపై భారం మోపుతున్నారు. టన్నుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారం మోయలేని వారు తమ నిర్మాణ పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఇదే అదునుగా వీలైన చోట్ల అక్రమార్కులు రాత్రి సమయాలలో నదుల నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వర్షం దెబ్బకు ఇసుక డంపుల వద్ద కొరత అధికంగా ఉండడంతో డిమాండ్‌ మరింత పెరిగింది. జిల్లాలో కడప, రాయచోటి, సికె దిన్నె, మైదుకూరు, బద్వేలు, పులివెందుల, కె.వెంకటాపురం, పోరుమామిళ్ల కేంద్రాలుగా ప్రభుత్వం ఇసుక డంపులను ఏర్పాటు చేసినది. పెన్నా, కుందూ, సగిలేరు నదులలో నీటి ప్రవాహం ఉండడంతో చాలా వరకు ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. ప్రభుత్వం మాత్రం ప్రజలకు టన్ను రూ.375కు చెల్లిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తూ రవాణా లోడింగ్‌ ఛార్జీల పేరుతో అధికంగా వసూలు చేస్తోంది. 18 టన్నుల ఇసుక ధర రూ.6,750 కాగా ఏడు కిలోమీటర్లకు రవాణా, లోడింగ్‌ చార్జీలు రూ.11,276 చెల్లించాల్సి వస్తోంది. ఇసుక కంటే రవాణా ఛార్జీలు రెండింతలు చెల్లించాల్సి వస్తోందని నిర్మాణ దారులు వాపోతున్నారు. జిల్లాలో ప్రతి రోజూ 1500 నుంచి 2 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక వినియోగం జరుగుతున్నది. ప్రభుత్వం అవసరమైన ఇసుక సరఫరా చేసే పరిస్థితిలో కనిపించడం లేదు. ప్రజల్లో ఇసుక డిమాండ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఇసుక రవాణాలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పది కిలోమీటర్ల వరకు పది టన్నుల సామర్థ్యం గల వాహనానికి రవాణా ఛార్జీలు రూ.800, 18 టన్నులకు 10 టైర్ల వాహనానికి రవాణా చార్జీలు రూ.1,260, ట్రాక్టర్‌కు రూ.450గా నిర్ణయించినప్పటికీ ఇందుకు భిన్నంగా ఆన్‌లైన్‌లో రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇసుక ప్రజలకు భారం అవుతుంది.

Related Posts