చిన్నమ్మ విడుదలకు అంతా రెడీ
చెన్నై, అక్టోబరు 31,
తమిళనాడులో శశికళ పేరు ప్రఖ్యాతులు మామూలుగా లేవు. జయలలిత సమాధి మీద కసి వెల్లబోసుకున్న అమ్మ.. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్నారు కదా. అమ్మ విడుదలకి.. అదేనండీ చిన్నమ్మ విడుదలకి అంతా రెడీ అయిందంట. బయటికొచ్చి షాపింగులు చేశారనీ.. అదీ జైలా ఫైవ్ స్టార్ హోటలా అని.. ఎన్నో ఉన్నాయి కదా. ఏదెలా ఉన్నా.. అమ్మ అయితే.. నాలుగేళ్ల పాటు జైల్లో ఉండక తప్పలేదు. ప్రత్యర్థులు పట్టి పట్టి చూపించి.. ఉల్టా పల్టా చేసి.. అమ్మని ఇబ్బంది పెట్టారు. ఫైనల్ గా అక్కడే సర్దుకుపోయారు చిన్నమ్మ కూడా. ఎన్నో ప్రయత్నాలు చేసిన శశికళ.. శిక్షాకాలం పూర్తి చేస్తున్నారు. కానీ.. ఒక్క రోజైనా.. ఎట్ లీస్ట్ ఒక్కరోజైనా ముందు రిలీజ్ కావాలి. శిక్ష పూర్తి కాక ముందే బయటికి తీసుకొచ్చాం అని నిరూపించుకోవాలి అని ఆమె అనుచరులు.. చోళనాడు పేరాసి చిన్నమ్మ గా పిలుచుకునే వాళ్లంతా కసి మీద ఉన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎలాగూ శిక్ష కంప్లీట్ అవుద్ది.. తనకు తానుగా బయటికి వస్తుంది. కానీ.. మేము బయట ఉండి చేసేది ఏమీ లేదా.. ముందే తీసుకురాలేమా.. ఎలాగైనా తీసుకొద్దాం అని చూస్తున్నారు. సత్ప్రవర్తన అనే ఆప్షన్ ఏదో ఉంటుంది కదండీ. దాని కోసం బానే ట్రై చేస్తున్నారు. కానీ.. అమ్మగారేమో అప్పట్లో బయటికొచ్చి షాపింగులు గట్రా చేశారనే టాకుండే. మరి ఆ ఆరోపణలు ఉంటే.. సత్ప్రవర్తన ఎలా అవుతుంది. అయినా చిన్నమ్మ సత్ప్రవర్తన ఎంత మంచిగా ఉంటుందో.. జయ లలిత చనిపోయినప్పుడు చూశారు కదా. అలాంటి చిన్నమ్మని సత్ప్రవర్తన కింద ఎలా రిలీజ్ చేస్తారు అంటూ.. అపొనెంట్ లు గట్టిగానే వాదిస్తున్నారు. కానీ.. కోర్టుల ఎవ్వారంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళకి..శిక్షతో పాటు.. పది కోట్లు పైన్ కూడా పడింది. ఇప్పుడు బయటికి రావాలంటే ఆ అమౌంట్ కట్టాలి. కానీ కడితే.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఎంక్వైరీలు తప్పవు.