రాంకీ పరిశ్రమ వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
వ్యర్థ రసాయనాలతో నష్టపోయిన రైతులు పెద్ద చెరువు వద్ద రిలే నిరాహార దీక్ష లు
విశాఖపట్నం అక్టోబర్ 31
రాంకీ ఫార్మాసిటీ వ్యర్ధాలు మరియు విషరసాయనాలు కలిసిన నీరుని కాలువ ద్వారా అక్రమంగా పరవాడ ఊరచెరువు, కోనాం చెరువు మరియు సన్యాసి చెరువులు లోకి విడుదల చేయడం వలన చెరువులలో ఉన్న మొత్తం నీరు కలుషితం కాగా పెద్దచెరువులో ఉన్న చేపలు మొత్తం చనిపోయాయి. దీని వలన పరవాడ గ్రామ ప్రజలందరూ తీవ్ర భయాందోళనలకు గురికాగా చేపలు వేసిన ఆయకట్టురైతులు తీవ్ర నష్టాల బారిన పడ్డారు . ఈ విషపూరితమైన వ్యర్థ రసాయన కాలుష్యజలలు చేరువులనుండి కళింగల ద్వారా పంట భూములలోకి కూడా రావడం వలన వ్యవసాయం చేసే రైతులు మరియు పశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.దీనివలన అనేక రకాలైన చర్మ వ్యాధులు, క్యాన్సర్లు, మహిళలకు గర్భధారణ మైన సమస్యలు,కిడ్నీ వ్యాధుల బారినపడి పరవాడ గ్రామ ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధులతో ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఎంతోకాలంగా వెంటాడుతున్న ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆయకట్టు రైతులు అందరూ ఏకమై పెద్ద చెరువు గట్టుపై రిలే నిరాహార దీక్షలు చేపట్టినారు. ఈ రిలే నిరాహార దీక్షలలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఎమ్మెల్యే గారు వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జీ ,రాజ్యసభ సభ్యులు అయిన గౌ౹౹ శ్రీ వేణు0బాక విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన 06.11.2020 శుక్రవారం నాడు పరవాడ గ్రామంలో పర్యటించి ఆయకట్టు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకునటకు విచ్చేయుచున్నారని ఆయకట్టుదారులు కు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు , ఆర్ ఇ సి ఎస్ మాజీ ఛైర్మన్ చల్లా కనకారావు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ మరియు పి ఎం సి ఛైర్మన్ పైల హరీష్, పెద్ద చెరువు ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షులు పైల రామచంద్రరావు, ఊర చెరువు ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షులు చుక్క సన్యాసిరావు, టీడీపీ నాయకులు రెడ్డి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు బండారు రామారావు , ఆర్ ఆర్ నాయుడు, చీపురుపల్లి సన్యాసిరావు, వర్రి హరి, పైల నాయుడు, చుక్క అప్పలనాయుడు పాల్గొని ఆయాకట్టుదారులు కు ,రైతులకు సంఘీభావం తెలియ చేసి రైతుల దీక్షకు తమ వంతు మద్దతు ప్రకటించారు..ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆయకట్టు రైతులు, ప్రజలు పాల్గొనారు.