YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగంలోకి మంత్రులు

 రంగంలోకి మంత్రులు

స్థానిక ఎన్నికల సమరం మాటెలా ఉన్నా దాని పేరు చెప్పి ఏపీ రాజకీయాలు ఒక్కసారి గా హీటెక్కిపోయాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల నిర్వహణకు చేస్తున్న సన్నాహాలను గమనిస్తున్న సర్కార్ ఆయనను వీక్ చేసే కార్యాచరణను తీవ్రం చేసింది. ముందుగా మంత్రి మేకపాటి సీన్ లోకి వచ్చి అబ్బే ఇప్పుడు ఎన్నికలు ఏమిటి అని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలకు ఎపి స్థానిక ఎన్నికలను కలపకూడదని కూడా తేల్చేశారు. ఆయన సుతిమెత్తగా ఈ వ్యాఖ్యలు చేస్తే ఇక వైసిపి ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని ఎంటర్ అయ్యారు.కొడాలి నాని సంగతి అందరికి తెలిసిందే కదా. తెలిసి ఎవ్వరు ఆయన నోట్లో నోరు పెట్టారు. పొరపాటున ఆయనే ఎవరినైనా టార్గెట్ చేస్తే ఎవరికి చెప్పుకోలేని రీతిలో లెఫ్ట్ రైట్ కోటింగ్ ఇస్తారు. ఇప్పుడు కొడాలి టార్గెట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయ్యారు. మరి కొద్ది నెలల్లో తట్టా బుట్టా సర్దుకునే నిమ్మగడ్డ ఎవరు ఎన్నికలను నిర్ణయించడానికి అంటూ నాని తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఘాటుగానే స్పందించారు. ఇలా నాని వదిలిన మాటల తూటా నిమ్మగడ్డను పూర్తిగా వీక్ చేసి పారేసేలాగే ఉన్నాయి.
ఏపీ లో తన పదవి కాలంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ తహతహ లాడుతున్నారు. ఆయన పదవీకాలం పూర్తి అయ్యాక తంతు పూర్తి చేయాలని వైసిపి సర్కార్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో పక్క కోర్ట్ ల ఆదేశాలతో తన పీఠం దక్కించుకున్న నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. ముఖ్యంగా అనామకుడిగా వచ్చి వెళ్లినట్లుగా పదవిలో కొనసాగకూడని కోరుకుంటున్న ఆయన విపక్ష పక్ష పాతిగా ఇప్పటికే ముద్ర వేసుకున్నారు. వారి కోరికలకు అనుగుణంగానే ఆయన అడుగులు సైతం పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సర్కార్ ను కాదని ఎన్నికలు నిర్వహించగలరా ? ఆయన అలా చేస్తే జగన్ ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది చర్చనీయంగా మారింది.

Related Posts