YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇసుక లభ్యత మరింత దుర్లభం

 ఇసుక లభ్యత మరింత దుర్లభం

కడప జిల్లాలో ఇసుక లభ్యత దుర్లభంగా మారింది. జిల్లాలోని నదీ ప్రవాహాలన్నింట్లో నిండుగా నీటి ప్రవాహాలు కొనసాగుతుండడమే కారణమని తెలుస్తోంది. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలకు ఇసుక సమృద్ధిగా లభిస్తేనే జిల్లా అభివృద్ధి పరుగులు తీసేది. కానీ నదీమ తల్లులు తమ గర్భాల నుంచి నీటి ప్రవాహాలను నింపుకోవడంతో ఇసుక తీయడానికి దుర్లభంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా లక్షన్నర క్యూబిక్‌ మీటర్ల వరకు ఇసుక డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో 33 వేల క్యూబిక్‌ మీటర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో వినియోగదారులకు అడిగిన వెంటనే ఇసుకను సరఫరా చేయడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది.జిల్లాలో ఇసుక లభ్యత బంగారాన్ని తలపిస్తోంది. గతేడాది జిల్లాలో 12 నుంచి 16 ఇసుక రీచ్‌ల్లో ఇసుక లభించేది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో నమోదైన అధిక వర్షాల కారణంగా ఇసుక రీచ్‌ల్లో పెన్నా, కుందూ, చెయ్యేరు తదితర నదుల్లో నీటి ప్రవాహాల గలగలల ధాటికి ఇసుక లభ్యత దుర్లభంగా మారింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కిచ్చమాంబపురం-4, కుమారునిపల్లి, పి.అనంతపురం ఇసుకరీచ్‌ల పరిధిలోని పట్టా భూముల్లో ఇసుక లభ్యమవుతోంది. జిల్లాలో ఇసుక డిమాండ్‌ ఊపందుకోవడంతో కిచ్చమాంబపురం-2, కొండూరు-2, కొండూరు-3 ఇసుక రీచ్‌లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో 61,0198 క్యూబిక్‌మీటర్లు మాత్రమే ఇసుక లభ్యమవుతోంది. ఇందులో నదీప్రవాహాల ధాటికి 33,0651 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే లభ్యమవుతోంది. లభ్యత, సరఫరా మధ్య తేడా 27,954 క్యూబిక్‌మీటర్ల మేర వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటువంటి ఇసుక కొరత పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసిన అనంతరం 10 రోజుల వరకు ఇసుక సరఫరా కావ డం లేదనే విమర్శలు జోరందుకున్నాయి. ఈనెల ఐదున కొత్త ఇసుక పాలసీ రానున్న నేపథ్యంలో అధికారులు సైతం ఏమీ చేయలేక ఎదురు చూ డాల్సిన దుస్థితి దాపురించింది. కొత్త ఇసుక పాలసీలో మైనింగ్‌శాఖకు ప్రాధాన్యత లభించనుందా, లేక ఇసుక కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగి స్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త పాలసీ అనంతరం మైనింగ్‌, ఇసుక కార్పొరేషన్‌ల మధ్య స్పష్టమైన వైఖరి వెల్లడైన అనంతరం ఇసుక లభ్యత, కొరతలపై సీరియస్‌గా దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శాండ్‌ ఆఫీసర్‌ను వివరణ కోరగా జిల్లాలోని ప్రధాన నదుల్లో నీటి ప్రవాహాలు పెరగడంతో ఇసుక లభ్యత కష్టంగా మారింది. దీంతో పట్టాభూములు కలిగిన ఇసుకరీచ్‌ల్లోని ఇసుకను సరఫరా చేయాల్సి వస్తోందని పేర్కొనడం గమనార్హం.

Related Posts