YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 గ్రీన్ సిగ్నల్....పడింది

 గ్రీన్ సిగ్నల్....పడింది

 గ్రీన్ సిగ్నల్....పడింది
హైద్రాబాద్, నవంబర్ 2,
ప్రజల అవస్థలను పట్టించుకోకుండా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బస్సులు తిప్పడంలో ఎంతో ఆలస్యం చేసిన సంగతి తెలిసిందే..! తెలంగాణ ఆర్టీసీ బస్సులు.. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకూ రావడం.. అక్కడ ఏపీ బస్సులు ఉండడం అందులో ఎక్కి గమ్యస్థానాలకు చేరడం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ తాము తెలంగాణ ఆర్టీసీ పెట్టిన అన్ని కండీషన్స్ కు ఒప్పుకుంటూ ఉన్నామని తెలిపింది. కానీ బస్సులు మాత్రం ఏపీ నుండి తెలంగాణకు, తెలంగాణ నుండి ఏపీకి తిరగలేదు. మధ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కావాల్సినంత ఆదాయాన్ని సంపాదించుకుంటూ వచ్చాయి. తాజాగా జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య అవగాహన కుదరడంతో త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లో నేడు సమావేశం కానున్న రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలకు తెరపడిందన్నారు. ఒప్పందం పూర్తయిన వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు.ఇప్పటి వరకు తెలంగాణకు 1,009 సర్వీసులతో 2,65,367 కిలోమీటర్ల మేర ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ఇక నుంచి ఇది 1,60,919 కిలోమీటర్లకు పరిమితం కానుంది.  ఏపీ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో బస్సు సర్వీసుల విషయంలో నెలకొన్న సమస్య కూడా కొలిక్కి వచ్చింది. ఈ రూట్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటి వరకు 374 బస్సులు నడుపుతుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 192కు పరిమితం కానుంది. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు 162 సేవలు అందించనున్నాయి.

Related Posts