ఏపీలో ఊరూరా అమూల్
విజయవాడ, నవంబర్ 2,
అమూల్ పాలు ఎంత ఫేమస్ అనేది వదిలేస్తే.. అమూల్ బేబీ మాత్రం ఫుల్లు పేమస్. సినిమాల్లో అమూల్ బేబీ డైలాగులు పేలడంతో.. ఇంకా ఫేమస్ అయింది. అప్పట్లో బానే కనిపించినా.. రీసెంట్ ఇయర్స్ లో అమూల్ బేబీ తక్కువగా కనిపిస్తోంది. చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ.. ఇక పై ఏపీలో అమూల్ బేబీ ఫుల్లు గా కనిపించబోతుంది. ఊరూరా అమూల్ బేబీ ఫ్లెక్సీలు గట్రా వెలుస్తాయి అనడంలో నో డౌట్. ఎందుకంటే.. ఇది సర్కార్ డెసిషన్.పాల సేకరణకి అమూల్ కంపెనీ వేసిన అడుగుల విషయంలో చాలా ఇష్యూ అవుతుంది కదా. అమూల్ కంపెనీని రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయినా సరే.. అమూల్ బేబీ అన్నీటినీ దాటుకుని మన గ్రామాల్లోకి వస్తోంది. ఊరూరా పాలు కొంటుందంట అమూల్ కంపెనీ. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అంతా జరగనుంది. ఏపీ సర్కార్ తో ఒప్పందాల తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. గవర్నమెంటే కొంటుంది అనే పబ్లిసిటీ ఉంది ఇప్పుడు. ప్రైవేట్ కంపెనీల పాల దోపిడీని అడ్డుకుంటాం అనే స్టైల్ లో లోకల్ గా ప్రచారం నడుస్తోంది. గ్రామ సభలు, ఆఫీసర్లు, కలెక్టర్లు ఇలా అందరూ అమూల్ పై ఫోకస్ చేశారు. రోజూ అమూల్ పాలు సేకరణ చేయడం పది రోజులకు పేమెంట్ చేయడం. రైతుల నుంచి పాల దోపిడీ జరక్కుండా ఆఫీసర్లు చూసుకోవడం. పాల ఉత్పత్తి పెంచేలా.. పాల పదార్థాల ఉత్పత్తులను పెంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతాయట. గవర్నమెంట్ తో జరిగిన అవగాహన ఒప్పందాల తర్వాత.. అమూల్ కంపెనీ.. అన్ని జిల్లాల్లో తమ ప్రతినిధులతో సర్వేలు గట్రా చేయించింది. ఇప్పుడు మూడు జిల్లాల్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ముందుగా స్టార్ట్ కాబోతుంది అమూల్ పాల సేకరణ. ఇక్కడి రిజల్ట్ ని బట్టి.. పెంచుతారట.