కరోనా ఒకపక్క విజృంభిస్తుంటే మరోపక్క ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు నేటి నుండి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా తెచ్చుకోగా ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం నామమాత్రంగానే ఈరోజు నుంచి ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కరోనా భయం ఉన్నప్పటికీ పాఠశాలలకు పిల్లలను పంపిస్తామని కొంతమంది చెప్తుండగా చదువు కంటే తమ పిల్లల ఆరోగ్యం ముఖ్యం అనే అభిప్రాయంతో పిల్లలను స్కూలుకు కొంతమంది తల్లిదండ్రులు పంపించలేదని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో స్కూల్లో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు స్కూల్ లు ప్రారంభం పై తల్లిదండ్రులు, విద్యార్థులు విభిన్న అభిప్రాయాలతో ఉన్నారు