YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా సీపీఎం జాతీయ మహాసభలు

ఘనంగా సీపీఎం జాతీయ మహాసభలు

సీపీఎం 22వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణమండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరులకు పొలిట్ బ్యూరో, ప్రతినిధులు నివాళులర్పించారు. సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు స్వాగతోపన్యాసం చేశారు. దళితుతులు, బహుజనులను మేల్కొలిపి వారిని ఐక్యం చేయడానికి తమ్మినేని సీతారాం మహాజనయాత్ర తోడ్పడిందన్నారు. లెఫ్ట్ పార్టీల ఐక్యత ఎంతో అవసరమని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బెంగాల్, కేరళలో కమ్యూనిస్టులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయని, ఉమ్మడి పోరాటాలకు మద్దతు ఎప్పుడూ ఉంటుందని సురవరం అన్నారు.  దేశం లో 73 శతం సంపద 1 శాతం కుటుంబాల చేతుల్లో ఉంది. ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. చనిపోయిన వారిలో  మేధావులు, ప్రొఫెసర్ లు, జర్నలిస్ట్ ఉన్నారు. అర్ ఎస్ ఎస్, బీజేపీ రాజ్ భవన్ ల ని అధికార కేంద్రాలుగా వాడుతుందని అయన ఆరో్పించారు. గోవా, మణిపూర్ లో ఇదే నిరూపణ అయింది. లెఫ్ట్ పార్టీ ల ఐక్యత ఎంతో అవసరమని అయన అన్నారు. 

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాట్లాడుతూ కేంద్రం విభజించి పాలించు విధానాన్ని అమలు చేస్తోందని. దేశం ఇప్పుడు క్రాస్రోడ్లో ఉందన్నారు. కేంద్రం  ఆరెస్సెస్ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. ఇటివల మరణించిన పార్టీ నేతలుమహమ్మద్ ఆమిన్, కగేన్ దాస్, సుఖు మాల్ సేన్, నూరు ల్ హుఢ, సుబోద్  మెహతా లకు సభ సంతాపం తెలిపింది.

నాలుగు రోజులు పాటు జరిగే మహాసభలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు. మతోన్మాదం, రైతాంగ సమస్యలు సహా పలు తీర్మానాలను మహాసభలు ఆమోదించనున్నారు. ఈనెల 22న సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

Related Posts