గుంటూరు జిల్లా జైలు వద్దకు రైతులను పరామర్శించేందుకు జనసేన నేతలు వచ్చారు.అయితే వారికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, జన సేన నేతలకు
వాగ్వివాదం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పొతిన
మహేష్ , గాదె వెంకటేశ్వరరావు పాల్గోన్నారు. . బేడీలు వేసి జైలు లో పెట్టే అంత తప్పు రైతులు ఏం చేశారు. జైలు లో ఉన్న రైతులను పరామర్శించడానికి కూడా పోలీసు
అడ్డుకుంటున్నారని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అరోపించారు. పోలీసుల తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. రాజధాని కోసం రైతులు ఏడాది గా ఉద్యమం చేస్తుంటే పోటీ ఉద్యమాలు
పెట్టడం సిగ్గు చేటు. అమరావతి కోసం గల్లా జయదేవ్ , మూడు రాజధానులు కోసం నందిగం సురేష్ లు ఎంపీ పదవులకు రాజీనామా చేయాలి. ఎవరు గెలిస్తే వారి వాదనను అంగికరిద్దాం.
తక్షణమే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయాలని అయన డిమాండ్ చేసారు.