నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు
వరలక్ష్మి కుటుంబానికి రూ 10 లక్షలు చెక్కు అందించిన హోంమంత్రి సుచరిత
విశాఖపట్నం నవంబర్ 2,
గాజువాక శ్రీనగర్ లోని ప్రేమోన్మాది కర్కసానికి భలైన వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ర్ట హోంమంత్రి మేకపాటి సుచరిత సోమవారం ఉదయం పరామర్శించారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అదేశాలతో పది లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు పద్మప్రియ గురునాధరావులకు అందజేసారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రేమోన్మోది అఖిలసాయిని అతని సహకరించిన వారిని కూడా విచారణ జరిపి కఠినంగా శిక్ష పడేలా చెస్తామని హమి ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసును దిశాకు అప్పగించనట్లు తెలిపారు. వరలక్ష్మిని అతి దారుణంగా హత్య చేయటం చాలా భాధకరమైన విషయమని ఈ సంఘటనను ముఖ్యమంత్రి శిరియస్ గా తీసుకొని పోలిసు అదికారులకు ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అన్నారు ఈ ప్రభుత్వంలో మహిలలపై అకృత్యాలకు పాల్పడిన వారు ఏంతటివారినైన విడిచిపెట్టేది లేదని హోంమంత్రి తెలిపారు.భాదిత కుటుంబాని ప్రభుత్వం అన్ని విదాలుగా ఆదుకుంటుందని హమి ఇచ్చారు వరలక్ష్మి తల్లిదండ్రులకు మనోదైర్యంగా వుండాలని నచ్చచూప్పారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సుచరిత ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రశాంత విశాఖ నగరంలో ఇలాంటి అలజడులు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మహిళలు యువతులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అన్నారు