మోగిన బడి గంటలు
వుయ్యూరు నవంబర్ 2,
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునప్రారంభమయ్యాయి.. కృష్ణా జిల్లా ఉయ్యురు లోని వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ పాఠాశాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు తరగతులను ప్రారంభించారు. తొలుత 9, 10 తరగతులను ప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే..నాలుగు నెలల తర్వాత విద్యాసంస్థలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యారు..ప్రతి ఒక్క విద్యార్థికి శానిటైజర్ అందిస్తూ కోవిడ్ నిబంధనలను అధ్యాపకులు బోదిస్తున్నారు..తరగతి గదికి 16 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకున్నారు.. బెంచ్ కు ఒక విద్యార్థి కి పరిమితమయ్యేలా ఏర్పాట్లు చేశారు... పాట శాలకు హాజరైన విద్యార్థులు తొలుత కరోనా మహమ్మారి పోవాలంటూ ప్రార్థనలు చేశారు..కరోనా బారిన పడకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థుల చే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు... విద్యార్థుల తల్లి దండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు యలమంచిలి వెంకటేశ్వరరావు తెలిపారు... విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలను, కోవిడ్ నివారణకు తాము తీసుకున్న చర్యలు పరిశీలించి విద్యార్థులను పాఠశాల కు పంపాలని కోరారు..