YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందస్తు జాగ్రత్తలు

 ముందస్తు జాగ్రత్తలు

కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో ఏపీలో 7 నెలలుగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవా లని అధికారులు పాఠశాల యాజమాన్యంకు సూచించారు. తొమ్మిది, పదితో పాటు ఇంటర్ విద్యార్థుల కు తరగతులు రోజు విడిచి రోజు... ఒక్క పూట నిర్వ హిస్తారు.రొటేషన్ పద్ధతిలో తరగతులను నిర్వహిస్తా రు. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాల లు ప్రారంభం అవుతాయి.నవంబర్ 2 నుంచి 9,10,11 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబం ధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహి స్తారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసేందుకు సిలబస్ రూపకల్పన చేస్తున్నారు. స్కూళ్లకు 180 రోజుల పని దినాలు ఉంటాయి.
స్కూళ్లు తెరుస్తుండ టంతో  కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అదే సమయంలో  విద్యార్ధులు సైతం కచ్చితంగా జాగ్రతలు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్, శానిటైజర్, మాస్కూలు తప్పనిసరిగా వాడాలని సూచిస్తు న్నారు. ఏపీలో ఇప్పటికే కరోనా కేసులు 8 లక్షలు దాటాయి. ఏది ఏమైనా డిసెంబర్ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందంటున్నారు ముఖ్యంగా విద్యార్ధులు మరింత జాగ్రత్తలు తీసుకో వాలని అధికారులు కోరుతున్నారు

Related Posts