YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ధరణి రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ధరణి రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ధరణి రిజిస్ట్రేషన్లు
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లను పరిశీలించిన సి.ఎస్
త్వరలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సి.ఎం. ప్రకటన
 హైదరాబాద్, నవంబర్ 2 
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ధరణి సేవలు విజయవంతంగా ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్  తాహసిల్దార్  కార్యాలయంలో  ధరణిసేవల ప్రారంభకార్య్రక్రమాన్ని సి.ఎస్. సోమేష్ కుమార్. నేడు ఉదయం ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్బంగా ధరణి ద్వారా చేసిన తోలి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను మంచాల ప్రశాంతి కి సి.ఎస్. అందచేశారు. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అడిషనల్ కలెక్టర్ హరీష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా  సి.ఎస్. మాట్లాడుతూ, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన కభిస్తోందని, నేడు ఉదయం 10 .30 గంటలవరకు 946 మంది రెజిస్ట్రేషన్లకై నగదు చెల్లించగా, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని వివరించారు. అక్కడక్కడా స్వల్ప సాంకేతిక సమస్యలు మినహా రిజిస్ట్రేషన్లు విజయవంతంగా ప్రారంభమయ్యాయని సోమేశ్ కుమార్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో అమలవుతాయని అన్నారు. రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ను మీసేవా కేంద్రాల ద్వారా కేవలం రూ 200 చెల్లించి చేసుకోవచ్చని, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని అన్నారు. భూముల అమ్మకాలు, గిఫ్ట్ సెల్, మరణించిన వారి వారసులకు రిజిస్ట్రేషన్, ఫ్యామిలి పార్టీషన్ రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయని అన్నారు.  నాలా, పాత రిజిస్ట్రేషన్లు, పాత మ్యుటేషన్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల పై త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటిస్తారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్ ప్రింట్ లకు సంబంధించి సమస్యలేర్పడితే కంటి చూపు (ఐ సైట్ ) ద్వారా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు అందనున్న ధరణి సేవలు అందుబాటులో వచ్చాయని, ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల కాతాలు ధరణిలో నిక్షిప్తం చేశామని తెలిపారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే సారి జరిగే ఈ కొత్త పద్దతి దేశంలోనే వినూత్నమని తెలియచేసారు.

Related Posts