YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దాణా కేసులో అందరికి శిక్ష

దాణా కేసులో అందరికి శిక్ష

దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌‌ను దోషిగా నిర్దరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మొత్తం నాలుగు కేసుల్లో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మిగతా 37 మంది దోషులకు రాంచీలోని సీబీఐ కోర్టు శిక్షలను ఖరారు చేసింది. దోషులకు మూడు నుంచి 14 ఏళ్ల శిక్షతోపాటు కొందరికి రూ.కోటి వరకు జరిమానా విధించింది. వీరిలో నలుగురికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు లాయర్ తెలిపారు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ శివ్‌పాల్ సింగ్ బుధవారం శిక్షలను ఖరారు చేసినట్టు ఆయన వెల్లడించారు. దుమ్కా ఖజానా నుంచి 1991-92, 95-96 మధ్య కాలంలో రూ.34.91 కోట్లు అక్రమంగా మళ్లించినట్టు రుజువుకావడంతో న్యాయస్థానం 37 మంది నిందితులను ఏప్రిల్ 9 న దోషులుగా నిర్దరించింది. ఇప్పటి వరకు 51 దాణా కేసుల్లో సీబీఐ కోర్టు తీర్పును వెల్లడించింది. లాలూపై దాణ కుంభకోణంలో ఐదు కేసులు నమోదుకాగా, నాలుగింటిలో ఆయన దోషిగా రుజువుకావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించారు. ఈ తీర్పుపై లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించాడు. దాణా కుంభకోణంలో 72 మందిపై కేసు నమోదుచేసిన సీబీఐ 2004లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 72 మంది నిందితుల్లో 14 మంది కేసు విచారణలో ఉండగానే మరణించారు, మరో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించగా, మరో ఇద్దరు పరారయ్యారు. మొత్తం 37 మందికి ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్టు తేలగా, ఐదుగుర్ని న్యాయస్థానం నిర్దోషులుగా పేర్కొంది. ప్రస్తుతం జైల్లో ఉన్న లాలూ అస్వస్థతకు గురికావడంతో రాంచీలోని ఎయిమ్స్‌లో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు.

Related Posts