YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

చలానాల వసూళ్లకు డ్రైవ్

చలానాల వసూళ్లకు డ్రైవ్

చలానాల వసూళ్లకు డ్రైవ్
హైద్రాబాద్,నవంబర్ 3, 
రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల పెండింగ్ చలానాలను వసూళ్ల చేపట్టేందుకు రాష్ట్ర పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకుల నుంచి జరిమానా మొత్తాలను వసూలుకు ట్రాఫిక్ విభాగం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని హైవేలలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు వెరసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. పెండింగ్ చలానాలను కట్టేంత వరకు వాహనాలను వదిలిపెట్టడం లేదు. ఈక్రమంలో పెండింగ్ చలానాలలో 75శాతం కట్టి కదలాలంటూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాగా లాక్‌డౌన్ సమయంలో విధించిన జరిమానాలతో పాటు ఆయా వాహనాలకు గతంలో పెండింగ్‌లో ఉన్న చలానాలను వాహన చోదుకుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.ఇంతకాలం ఉదాసీనంగా ఉన్న రాష్ట్ర పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాత పద్దులను వసూలు చేసుకునే పనికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పెండింగ్ చలాన్లను వెంటనే కట్టకపోతే వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 22 లక్షల చలా న్లు విధించిన విషయం విదితమే. వాటి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని వెంటనే రికవరీ చేసి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు.చలాన కట్టని వారి పని పట్టేందుకు రంగంలో దిగారు హైదరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ఇప్పటికే ఆన్ లైన్ లో చలాన మెసెజ్ పంపించిన పోలీసులు వెంటనే కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. అయిదు అంతకంటే ఎక్కువ చలాన్లు ఉన్న వాళ్లకి ఏకంగా నోటీసులే జారీ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు.రహదారులపైకి వచ్చిన వాహనాలకు గతంలో ఉన్న పెండింగ్ చలాన్లను అక్కడే కట్టించుకుంటున్నారు. చలాన కట్టని వెహికల్స్ ను వెంటనే సీజ్ చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం వాహనం నడిపే వారికి కూడా రూల్స్ తప్పనిసరి చేసింది. ఇక టూవీలర్ వాహనానికి సైడ్ మిర్రర్స్, వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ధరించాలని నిబంధనలు విధించారు. లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ పోలీసులు తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణీంచే వాహన చోదకులకు జరిమానాలు విధించిన విషయం విదితమే. గల్ఫ్ తరహా టెక్నాలజీతో ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే ఆటోమెటిక్ ప్లేట్ రికగ్నేషన్ (ఎఎన్‌పిఆర్) కెమెరాలతో నిఘా సారించి ఫైన్‌లు విధించారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రధాన రహదారులలో, కూడళ్లలో వాహనాలను నిలిపి వాటిపై ఉన్న చలాలను కట్టితీరాల్సిందేనంటూ ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెబుతున్నారు.అదేవిధంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తించి జరిమానాలు వేశారు. అలాగే ఆయా వాహన చోదకులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్1897 ప్రకారం కేసులను నమోదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కారు నంబరు, వాహనం ఎంత వేగంలో ఉందన్నది గుర్తించి పోలీసులు గీత దాటిన వాహన యజమానుల వివరాలు సేకరించి వారికి నోటీసులు పంపారు.కాగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమితం కావాలన్నది నిబంధన ఉల్లంఘిచి కొందరు ఇష్టానుసారం ప్రయాణించారు. వారి వాహనాలను కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేశారు. ఈక్రమంలో గంటల్లోనే సదరు వాహన యజమాని గుర్తించి వాహన యజమానిపై ఐపిసి 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో గతంలో వాహనాలకు ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించాలని, లేనిపక్షంలో వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు

Related Posts