YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎవరి ధీమా వారిదే

ఎవరి ధీమా వారిదే

మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తాయన్న చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు ఈ ఉప ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. దీంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. పూర్తిగా స్థానిక నాయకత్వమే ప్రచారంలో పాల్గొంది. జాతీయ స్థాయి నేతలెవ్వరూ మధ్యప్రదేశ్ వైపు చూడకపోవడం విశేషం.మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఉంది. జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ పదవి నిలబడాలంటే కనీసం పదిహేను స్థానాల్లో పార్టీ విజయం సాధించాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలు ఈ 28 నియోజవర్గాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు.మరోవైపు కాంగ్రెస్ తరుపున మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ లు ప్రచార బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ కు అడ్వాంటేజీ ఏంటంటే ఆ పార్టీపై సానుభూతి ఉందంటున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసిందని ప్రజల్లోకి కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లగలిగింది. అందుకే కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులను స్థానిక ప్రజలు ప్రచారానికి కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో తాము అత్యధిక స్థానాల్లో గెలుస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ ఉన్నారు.కానీ కేంద్ర ప్రభుత్వం, రాష‌్ట్ర ప్రభుత్వంలోనూ తమ పార్టీయే ఉన్నందున మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమదే విజయమని బీజేపీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవినీతిని చూడలేకే నేతలు తమ పార్టీలోకి వచ్చారని శివరాజ్ సింగ్ తన ప్రచారంలో చెబుతున్నారు. కమల్ నాథ్ కు దళితులంటే గౌరవం లేదని, అందుకే మహిళపై అన్యాయంగా మాట్లాడి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని చౌహాన్ ప్రతిసభలోనూ గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు రెండు పార్టీలకు కీలకంగా మారడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు

Related Posts