YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మెగా ఫ్యామలీతో పెట్టుకోవద్దు : నాగబాబు

మెగా ఫ్యామలీతో పెట్టుకోవద్దు : నాగబాబు

తెలుగువాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఆదేశించే శక్తి 'మా'కు లేదని నటుడు నాగబాబు స్పస్టం చేశారు.  హీరోయిన్లు, కొంతమంది విలన్లు బయటవాళ్లు ఉన్నారని, ఎవరిని తీసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమన్నారు. తెలుగు నటులు కూడా ఇతర భాషల సినిమాల్లోనూ నటిస్తున్నారని నాగబాబు అన్నారు. సినిమాల్లో ఉన్న చెడు గురించి మాట్లాడేవాళ్లు.. మంచిని ఎందుకు గుర్తించరని ఆయన ప్రశ్నించారు. నచ్చని సినిమాలను చూడటం మానేయాలని, పరిశ్రమపై చిన్నచూపు చూడొద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు. కంపెనీ ఆర్టిస్టుల వేదన కదిలించిందని.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, కోఆర్డినేటర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు సమయం పడుతుందని నాగబాబు వ్యాఖ్యానించారు.క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనని... ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని  నెల రోజులుగా గమనిస్తున్నానని, ‘మా’లో సభ్యత్వం ఉన్న, సభ్యత్వం లేని లేడీ ఆర్టిస్టులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని అన్నారు. కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి, అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని సూచించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని అన్నారు. ‘మా’ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు న్యాయం చేయడం తమ బాధ్యతని, ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదని, తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదని అన్నారు.సినీరంగం అనేది మినీ ప్రపంచమని.... ఇక్కడ దేవుళ్లు, దేవతలు ఉండరు. మనుషులే ఉంటారు. ఎవడైనా  తమను వంకరగా చూస్తే అరెస్టు చేయించే హక్కు మహిళలకు ఉందన్నారు నాగబాబు. అలాగే సినీ రంగంలోనూ ఇలాంటివి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చుని మహిళలపై ఇలాంటి అకృత్యాలకు నేను వ్యతిరేకమన్నారు. ఎవరైనా ఆడపిల్లను ప్రలోభపెట్టే పనులు చేసినట్లు నా దృష్టికి వస్తే వాడి చెంప పగలగొడతాను. ఇద్దరు ముగ్గురికి నా నుంచి ఇలాంటి అనుభవం ఎదురైంది.  సినీ రంగంలో ఎవరైనా తమను వేధిస్తే అమ్మాయిలు చెప్పు తీసుకొని కొట్టండని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో 10 శాతం మంది వెధవలు ఉంటే.. 90శాతం మంది మంచి వాళ్లున్నారు. కొందరిని చూసి ఇక్కడ అందరూ అలాంటివారే అన్న అభిప్రాయం ఏర్పరచుకోవడం మంచిది కాదు. ఈ పరిశ్రమపై గౌరవం ఉంది కాబట్టే నా కూతురిని ఈ రంగంలోకి ఆహ్వానించానని... ఇక్కడ ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అమ్మాయిలు తమకు మంచివారుగా అనిపించిన వారికి చెప్పండని నాగబాబు సూచించారు.భారతీయులందరికీ ఎక్కడైనా పనిచేసుకునే హక్కుంది. సినీ పరిశ్రమలో వేధింపులకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్‌ చెప్పడం తప్పా? అని నాగబాబు నిలదీశారు. ఎవరేమన్నా తమకు భరించే శక్తి ఉందని, విమర్శలను పట్టించుకోవద్దని అభిమానులకు పవన్‌ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఆధారాలు ఉంటే ఒకేసారి బయటపెట్టాలని నాగబాబు డిమాండ్ చేశారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం ప్రస్తుతం పక్కదారి పట్టిందని వ్యాఖ్యానించిన నాగబాబు, ఈ వివాదంలోకి సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి అంశాన్ని పక్కదారి పట్టించడంతోనే తాను స్పందించానని తెలిపారు. తాను ఓ మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని తన మాటలను యూట్యూబ్‌ ఛానళ్లు వక్రీకరించొద్దని హితవు నాగబాబు పలికారు.

Related Posts