YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

28 మంది వీధి బాలల గుర్తింపు

28 మంది వీధి బాలల గుర్తింపు

విజయనగరం జిల్లాలో  ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం నిర్వహించారు.వివిధ షాపులలో పనిచేస్తున్న 28 మంది వీధి బాలలను విజయనగరం వన్ టౌన్ పోలీసులు గుర్తించారు.రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్,జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆధ్వర్యంలో విజయనగరం పోలీసులు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టి, మెకానిక్ షాపులు, పూల కొట్టులు, హోటల్స్, వడ్రంగి పనులు, బొమ్మలు అమ్మడం, మటన్, చికెన్ షాపుల్లో పని చేస్తున్న వీధి బాలలను గుర్తించి,వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, చదువు కొనేందుకు ప్రభుత్వ పాటశాల లకు పంపాలని కోరారు. బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Related Posts