అరకులోయ మండలం లోని మాదల పంచాయతీ సరుభేడ్డ కూడలి నుండి పొట్టంగిపాడు గ్రామం వరకు 2కిలోమీటర్ల రోడ్డు చేపట్టాలని ఆయా గ్రామాల గిరిజనుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 40. లక్షలతో రోడ్డు నిర్మించాలని నిధులు విడుదల చేశారు రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోవడం రోడ్డు పనులు నిలిపివేశారు పెద్ద పెద్ద మెట్లు రాలు వేసి వదిలేయడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గాని వెళ్లలేని పరిస్తితి ఈ రోడ్డు వలన రతగుడ పొట్టంగిపాడు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు డిమాండ్ చేశారు రోడ్డు సౌకర్యం పూర్తి చేయకపోవడం వలన గర్భిణులు రోగులకు ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న గ్రామస్థులు టి.రాము డి.రాజు టి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు