YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనపై ప్రభుత్వం నిఘా గన్ మెన్లను వెనక్కి పంపించేసిన పవన్

జనసేనపై ప్రభుత్వం నిఘా గన్ మెన్లను వెనక్కి పంపించేసిన పవన్

ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను తిరస్కరించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. గన్‌మెన్లను వెనక్కు పంపించారాయన. పవన్ కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం 2 ప్లస్ 2 భద్రతను కల్పించింది. పవన్ కల్యాణ్ విన్నపం నేపథ్యంలో ప్రభుత్వం గన్‌మెన్లను నియమించింది. సినిమాలకు విరామం ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయిపోతున్న పవన్ ఇటీవలే భద్రతను కోరారు. ఆయన విన్నపానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గన్‌మెన్లను నియమించింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ సెక్యూరిటీ సిబ్బందిని తిప్పి పంపడం గమనార్హం. దీని వెనుక ఆసక్తికరమైన రీజన్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది వల్ల తన పార్టీకి సంబంధించిన రహస్యాలు లీక్ అవుతున్నాయని పవన్ అనుకుంటున్నారట. తన కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వ పెద్దలు వేగులుగా వాడుకుంటున్నారనే అనుమానాలు రేగాయట.అందుకే పవన్ కల్యాణ్ ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కు పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది. 

Related Posts